హలగలి గ్లింప్స్.. ఇదేదో బాగుందే..!
హలగలితో ధనుంజయ్ ఒక గొప్ప ప్రయత్నమే చేస్తున్నారనిపిస్తుంది. సినిమా గ్లింప్స్ అయితే అంచనాలను పెంచింది.
By: Ramesh Boddu | 17 Aug 2025 2:50 PM ISTకన్నడలో తన నటనతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ వస్తున్నాడు ధనుంజయ్. పుష్ప సినిమాలో జాలి రెడ్డి రోల్ లో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు ధనుంజయ్. అఫ్కోర్స్ అది కాస్త నెగిటివ్ టచ్ ఉన్న రోల్ అయినా కూడా తన పాత్రలో అదరగొట్టాడు. ఐతే ఇప్పుడు అతను సోలో హీరోగా ఒక క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడు. అదే హలగలి. సుఖేష్ నాయక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కళ్యాణ్ చక్రవర్తి దూళిపాళ్ల నిర్మిస్తున్నారు. హలగలి ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా గ్రాండియర్ అప్పీల్ అనిపించింది.
బిఫోర్ ఇండిపెండన్స్ కథతో హలగలి..
హలగలి బిఫోర్ ఇండిపెండన్స్ కథతో పీరియాడికల్ మూవీగా వస్తుంది. హలగలి అనే ఊరు మీద దండయాత్రకు వచ్చిన బ్రిటీషర్లకు అక్కడ నాయకుడు ఎలా బదులు చెప్పాడు అన్న కథతో ఈ సినిమా వస్తుంది. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ బ్లాక్స్, పీరియాడికల్ అప్పీల్ అదిరిపోయాయి. ఇక ధనుంజయ్ కూడా తన రోల్ లో అదరగొట్టేలా ఉన్నాడు. తన శూళంతో బ్రిటీష్ జెండాను కూలగొట్టే షాట్ అదిరిపోయింది.
పీరియాడికల్ స్టోరీ అది కూడా ఇండిపెండన్స్ ముందు కథ తో హలగలి వస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అయితే అంచనాలు పెంచింది. ఈమధ్య కాలంలో ఒక సినిమా అది ఏ భాష నుంచి వచ్చినా కూడా కథ, కథనం నచ్చేలా ఉంటే దాన్ని సూపర్ హిట్ చేస్తున్నారు. హల గలి కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గ్లింప్స్ తోనే గట్టి మ్యాటర్ ఉన్నట్టే అనిపిస్తుంది.
అంచనాలను పెంచిన ఫస్ట్ గ్లింప్స్
హలగలితో ధనుంజయ్ ఒక గొప్ప ప్రయత్నమే చేస్తున్నారనిపిస్తుంది. సినిమా గ్లింప్స్ అయితే అంచనాలను పెంచింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా దానికి యాడ్ అయ్యాయి. సో హలగలి హంగామా ఇంప్రెస్ చేసేలానే ఉంది. సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వస్తేనే కానీ ఇంకాస్త డెప్త్ ఏంటన్నది తెలుస్తుంది.
పుష్ప తర్వాత తెలుగులో ఛాన్స్ లు వచ్చినా తను కోరే లీడ్ రోల్స్ కాదని లైట్ తీసుకున్నాడు ధనుంజయ్. అందుకే ఇప్పుడు ఈ హలగలి సినిమాతో తన మాస్ స్టామినా చూపించనునాడు. హగలై సినిమా కన్నడ నుంచి రాబోతున్న మరో భారీ సినిమా అవుతుంది. కె.జి.ఎఫ్ నుంచి కన్నడలో భారీ సినిమాల నిర్మాణం జరుగుతుంది. అదే దారిలో హలగలి వస్తుంది.
