ఆ రిస్క్ వద్దంటున్న విశ్వక్.. 'కల్ట్'కు కలిసొచ్చేనా?
సినిమాపై బజ్ క్రియేట్ చేయాలంటే రిలీజ్కు ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేయడం ఈ మధ్య కాలంలో కామన్ స్ట్రాటజీ అయిపోయింది.
By: M Prashanth | 27 Oct 2026 3:02 PM ISTసినిమాపై బజ్ క్రియేట్ చేయాలంటే రిలీజ్కు ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేయడం ఈ మధ్య కాలంలో కామన్ స్ట్రాటజీ అయిపోయింది. కానీ తన లేటెస్ట్ మూవీ 'కల్ట్' విషయంలో విశ్వక్సేన్ మాత్రం పూర్తి రివర్స్ రూట్ ఎంచుకున్నారు. ప్రీమియర్స్ వేస్తే సినిమాను విడదీసి విశ్లేషించే సోషల్ మీడియా సైంటిస్టులు ఎక్కువైపోతారని, అందుకే డైరెక్ట్ గా ప్రేక్షకులకే బొమ్మ చూపిస్తానని సరదాగా కామెంట్ చేశారు. పైకి నవ్వు తెప్పించేలా ఉన్నా, ఈ నిర్ణయం వెనుక ఒక తెలివైన ఆలోచనతో పాటు కాస్త ఆలోచించాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఒక విధంగా చూస్తే విశ్వక్ తీసుకున్న నిర్ణయం చాలా లాజికల్ గానే అనిపిస్తుంది. 'కల్ట్' అనేది మన దగ్గర పెద్దగా రాని ఒక స్లాషర్ సర్వైవల్ థ్రిల్లర్. గోవాలోని ఓ ఐలాండ్లో వందల మంది చిక్కుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడానికి గేమ్స్ ఆడటం చుట్టూ కథ తిరుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలకు సర్ ప్రైజ్ ఎలిమెంట్స్, ట్విస్టులే ప్రాణం. ప్రీమియర్స్ పడితే నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో సీన్లు, ట్విస్టులు లీక్ అయిపోయి మరుసటి రోజు వచ్చే రెగ్యులర్ ఆడియన్స్కు ఆ కిక్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
అయితే మరోవైపు చూస్తే, ప్రీమియర్ల ద్వారా వచ్చే సాలిడ్ పాజిటివ్ టాక్ ఇచ్చే అడ్వాంటేజ్ ను విశ్వక్ వదులుకుంటున్నారా అనే సందేహం కూడా లేకపోలేదు. కంటెంట్ ఏమాత్రం బాగున్నా ప్రీమియర్స్ నుంచే సూపర్ హిట్ వైబ్స్ మొదలైపోయి, తొలి రోజు ఉదయం షోలకే అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకుంటాయి. గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, డైరెక్టర్ గా విశ్వక్ చేస్తున్న ఈ మూడో ప్రయత్నానికి మొదటి రోజు మార్నింగ్ షోలు ముగిసే వరకు టాక్ కోసం టెన్షన్ తో ఎదురుచూడాల్సి వస్తుంది.
పైగా అక్టోబర్ 30న వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' లాంటి భారీ చిత్రం బాక్సాఫీస్ బరిలో ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉన్న వేళ, 'కల్ట్' తన డార్క్ అండ్ వయలెంట్ కంటెంట్ తో యూత్ ను మాత్రమే టార్గెట్ చేస్తోంది. తన సినిమా ఎవరి కోసం తీశానో విశ్వక్ కు పూర్తి క్లారిటీ ఉంది కాబట్టే, అనవసరమైన ముందుస్తు తీర్పుల జోలికి వెళ్లకుండా తన టార్గెట్ ఆడియన్స్ నేరుగా థియేటర్లకు వస్తారనే ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రానికి బిజినెస్ పరంగా కూడా బలమైన సపోర్ట్ దక్కింది. నైజాంలో ఏషియన్ సునీల్, వైజాగ్లో దిల్ రాజు ఎస్వీసీ, గోదావరి జిల్లాల్లో సురేష్ మూవీస్ వంటి టాప్ డిస్ట్రిబ్యూటర్లు రంగంలో ఉన్నారు. దాదాపు 150 మంది నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రానికి రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తరుణ్ భాస్కర్ డైలాగులు ప్రధాన బలంగా మారనున్నాయి. ఇక మొదటి రోజే థియేటర్ల బయటే ఆపేసి ట్విస్టులను కాపాడుకోవడంలో విశ్వక్ ఆలోచన సరైనదే కావచ్చు. కానీ ప్రీమియర్స్ హైప్ లేకుండా నేరుగా రంగంలోకి దిగినప్పుడు, ఈ సరికొత్త స్లాషర్ ఎక్స్ పెరిమెంట్ ను తెలుగు ఆడియన్స్ తొలి షో నుంచే ఏ మేరకు ఓన్ చేసుకుంటారనే చూడాలి.
