పెళ్లికి ముందే తండ్రులు అయిన క్రికెటర్లు
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 2020 జనవరిలో నటాషా స్టాంకోవిక్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు.
By: Sivaji Kontham | 24 Jan 2026 6:00 AM ISTక్రికెటర్లలో కొందరు సినిమా కథానాయికలను పెళ్లాడారు. మరికొందరు విభిన్న రంగాల్లోని సెలబ్రిటీలను పెళ్లాడి లైఫ్ లో సెటిలయ్యారు. అయితే పాపులర్ క్రికెటర్లు పెళ్లికి ముందే తల్లిదండ్రులైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు నిశ్చితార్థం తర్వాత పెళ్లికి ముందే పిల్లలను ఆహ్వానించగా, మరికొందరు తమ భాగస్వాములతో ఉన్న సంబంధం ద్వారా తల్లిదండ్రులయ్యారు. అలాంటి కొందరి వివరాలు పరిశీలిస్తే...
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 2020 జనవరిలో నటాషా స్టాంకోవిక్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మే నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలై 2020లో వారికి కుమారుడు అగస్త్య జన్మించారు. వీరు ముందుగా కోర్టు మ్యారేజ్ చేసుకున్న తర్వాత.. 2023లో రాజస్థాన్‌లో ఘనంగా వివాహ వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం వీరు విడిపోయారు. అగస్త్యకు సహ తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు.
వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ .. భారతీయ నటి నీనా గుప్తాల ప్రేమకథ అప్పట్లో పెద్ద సంచలనం. వీరిద్దరూ వివాహం చేసుకోలేదు.. కానీ వారికి 1989లో కుమార్తె మసాబా గుప్తా జన్మించారు. నీనా గుప్తా ఒంటరిగానే మసాబాను పెంచి పెద్ద చేశారు. మసాబా ప్రస్తుతం భారతదేశంలోనే పాపులర్ ఫ్యాషన్ డిజైనర్‌గా కొనసాగుతున్నారు.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అతడి భార్య క్యాండిస్ పెళ్లికి ముందే తల్లిదండ్రులయ్యారు. వీరి మొదటి కుమార్తె ఐవీ మే 2014 సెప్టెంబర్‌లో జన్మించారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత, అంటే ఏప్రిల్ 2015లో వార్నర్ - క్యాండిస్ వివాహం చేసుకున్నారు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ .. క్యారీ కాట్రెల్ 2016లో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి మొదటి సంతానం, కుమారుడు ఆల్ఫ్రెడ్ 2017 జనవరిలో జన్మించారు. ఆ తర్వాత ఏడాది అంటే 2018 డిసెంబర్‌లో వీరు వివాహం చేసుకున్నారు.
ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా ఇదే జాబితాలో ఉన్నారు. ట్రావిస్ -ఆయన భార్య జెస్సికా డేవిస్‌కు 2022 సెప్టెంబర్‌లో కుమార్తె మిల్లీ జన్మించారు. వీరి వివాహం 2023 ఏప్రిల్‌లో జరిగింది.
మాజీ భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆండ్రియా హెవిట్‌తో రిలేషన్‌లో ఉన్నారు. వీరు 2014లో వివాహం చేసుకోగా, అంతకు ముందే 2010లో వారికి కుమారుడు జన్మించారు.
ఈ క్రికెటర్లందరూ తమ వ్యక్తిగత నిర్ణయాలతో సామాజిక కట్టుబాట్ల పరంగా చర్చకు దారితీశారు. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం సామాజికంగా అంగీకరించే విషయం కాదు. కానీ ఇటీవలి కాలంలో భారతదేశంలోను సహజీవన వ్యవస్థ ప్రకంపనాలు సృష్టిస్తోంది. కాపురంలో వేగంగా బ్రేకప్ లు, ప్యాకప్ లు కూడా పెద్ద చర్చాగా మారాయి.
