చీరకట్టులో దేవకన్యలా వెలిగిపోతున్న శ్రీలీలా.
అందం.. అభినయం.. నటనతో కూడా ఆకట్టుకుంటూ అటు నిర్మాతల మనిషిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది శ్రీ లీల.
By: Madhu Reddy | 23 Feb 2026 9:24 AM ISTఅందం.. అభినయం.. నటనతో కూడా ఆకట్టుకుంటూ అటు నిర్మాతల మనిషిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది శ్రీ లీల. సాధారణంగా ఒక సినిమాలో హీరోయిన్ నటిస్తోంది.. అందులో స్పెషల్ సాంగ్ ఉంది అంటే హీరోయిన్ తో పాటు మరో హీరోయిన్ ను స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ శ్రీ లీలా హీరోయిన్ గా చేస్తోంది అంటే అందులో హీరోయిన్గా చేయడమే కాదు స్పెషల్ సాంగ్ లో కూడా చేసి నిర్మాతలకు భారీగా ఖర్చు తగ్గిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే ధమాకా, గుంటూరు కారం వంటి చిత్రాలలో హీరోయిన్ గానే కాకుండా ఇటు స్పెషల్ సాంగ్ లు కూడా చేసి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తమిళ్, హిందీ , తెలుగు అంటూ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇకపోతే వరుసగా అవకాశాలు అందుకుంటుంది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం లభించడం లేదు. చివరిగా తమిళంలో పరాశక్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈ సినిమా ఒక వర్గం ఆడియన్స్ నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది. అటు బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ తో పాటు సిద్ధార్థ మల్హోత్ర సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా బయటకు రాకపోవడంతో అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక మరొకవైపు తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో నటిస్తోంది. పైగా ఈ సినిమాకు సంబంధించిన రెండవ పాట "ఆరా ఆఫ్ ఉస్తాద్ " అంటూ నిన్న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో పవన్ మ్యానరిజం ను హరీష్ శంకర్ డీకోడ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఇక భారీ బడ్జెట్తో ఊహించని అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై శ్రీ లీల అంచనాలు పెట్టేసుకుంది. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ తన ఖాతాలో పడుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తోంది
ఇక మరొకవైపు ఇటీవలే తన డాక్టర్ కోర్స్ ను కూడా పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా క్రీం కలర్ చీర కట్టుకొని అందాలు ఆరబోస్తూ దేవకన్యలా కనిపించింది. జుట్టును ఫ్రీగా వదిలేసి తన అద్భుతమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో మరోసారి అభిమానుల హృదయాలను దోచుకుంది అని చెప్పవచ్చు. మొత్తానికైతే శ్రీ లీల ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు అభిమానుల గుండెల్లో గుణపాలు దింపేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సో క్యూట్, లవ్లీ అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు అలాగే ఫైర్, లవ్ ఎమోజీలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.
