Begin typing your search above and press return to search.

'కపుల్ ఫ్రెండ్లీ' బాక్సాఫీస్.. ఫస్ట్ డే ఇది పరిస్థితి

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తే థియేటర్లకు ఎగబడుతున్నారు.

By:  M Prashanth   |   15 Feb 2026 12:31 PM IST
కపుల్ ఫ్రెండ్లీ బాక్సాఫీస్.. ఫస్ట్ డే ఇది పరిస్థితి
X

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తే థియేటర్లకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక డీసెంట్ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ స్వచ్ఛమైన ప్రేమకథ రిలీజ్ రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.




టాలీవుడ్‌లో చాలా కాలంగా కమర్షియల్ సక్సెస్ కోసం చూస్తున్న సంతోష్ శోభన్ ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రొటీన్ రెగ్యులర్ సినిమాల జోలికి వెళ్లకుండా, పక్కా లోకల్ అబ్బాయిలా కనిపించే కథలనే అతను ఎంచుకుంటారు. ఈ సినిమాలో కూడా నటన చాలా నేచురల్‌గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక మిస్ ఇండియా ఫేమ్ మానస వారణాసి తొలి సినిమాతోనే తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది.

వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచినట్లు కామెంట్స్ వస్తున్నాయి. ఇక తొలిరోజే ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం మొదటి రోజున 1.89 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రీమియర్స్ తో కలుపుకుని ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం చూస్తుంటే, చిన్న సినిమా అయినా సరే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసిందని అర్థమవుతోంది. డీసెంట్ టాక్ ఉండటంతో వీకెండ్ లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ ఈ కథను చాలా సింపుల్‌గా, ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారనే కామెంట్స్ వచ్చాయి. మిడిల్ క్లాస్ జీవితం, వారి మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, ప్రేమను చాలా రియలిస్టిక్ గా చూపించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అజయ్ కుమార్ రాజు పి నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ అయ్యింది. పాటలు కూడా ముందే హిట్ అవ్వడం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సంతోష్ శోభన్ మేనరిజమ్స్, సింపుల్ డైలాగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. యువీ క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ల నుండి కూడా మంచి సపోర్ట్ లభించింది. పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా ‘కపుల్ ఫ్రెండ్లీ’కి కలిసివచ్చిన అంశం.

ఫైనల్ గా సంతోష్ శోభన్ ఖాతాలో మరో డీసెంట్ హిట్ పడినట్లే కనిపిస్తోంది. మొదటి రోజు కలెక్షన్స్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా లాంగ్ రన్ కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇక వీకెండ్ లో లెక్క ఎక్కడివరకు చేరుకుంటుందో చూడాలి.