Begin typing your search above and press return to search.

వైరల్ బ్యాంగ్ బ్యాంగ్ డ్యాన్స్.. హృతిక్ రోషన్ ని టచ్ చేశారు..!

బాలీవుడ్ సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ వీడియో వైరల్ అయ్యింది.

By:  Ramesh Boddu   |   2 Jan 2026 12:20 PM IST
వైరల్ బ్యాంగ్ బ్యాంగ్ డ్యాన్స్.. హృతిక్ రోషన్ ని టచ్ చేశారు..!
X

బాలీవుడ్ సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ వీడియో వైరల్ అయ్యింది. బాలీవుడ్ లో డ్యాన్స్ అదరగొట్టే హృతిక్ రోషన్ అక్కడ ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తున్నారన్నది తెలిసిందే. ఐతే హృతిక్ రోషన్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ కి అంకిత్ మార్క్ తన డ్యాన్స్ తో మెప్పించాడు. ఫ్రీ టైం లో ఆఫీస్ ఫ్లోర్ మీద బ్యాంగ్ బ్యాంగ్ పాటకి తనదైన శైలిలో స్టెప్పులు వేసి అదరగొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తుంది. ఒక్కరోజులోనే ఈ వీడియోని 9 మిలియన్ వ్యూస్ సాధించింది.

హృతిక్ రోషన్ దాకా చేరకుండా ఉంటుందా..

ఐతే ఈ వీడియోని మరింత వైరల్ చేసి హృతిక్ రోషన్ దాకా చేరాలని నెటిజన్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఐతే ఈ రేంజ్ హడావిడి చేస్తున్న వీడియో హృతిక్ రోషన్ దాకా చేరకుండా ఉంటుందా.. ఫైనల్ గా అంకిత్ సరదాగా వేసిన బ్యాంగ్ బ్యాంగ్ డ్యాన్స్ వీడియోని హృతిక్ రోషన్ కూడా చూశాడు. అంకిత్ మార్క్ డ్యాన్స్ వీడియో కింద హృతిక్ రోషన్ నాకు ఆ మూవ్స్ నేర్పించు అంటూ కామెంట్ పెట్టాడు.

ఏదో సరదాగా కొలీగ్స్ కోసం వేసిన అంకిత్ డ్యాన్స్ వీడియో ఈ రేంజ్ లో వైరల్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు. ముఖ్యంగా ఎవరి పాట అయితే డ్యాన్స్ చేస్తున్నారో అతనే ఆ వీడియో చూసి కామెంట్ పెట్టడం అన్నది క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు. ఐతే అంకిత్ ఈ వీడియోని షేర్ చేస్తూ కార్పొరేట్ జాబ్ కోసం తన ప్యాషన్ ని చంపుకున్న వ్యక్తి అంటూ ప్రమోట్ చేయడం ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది.

ఈ కార్పొరేట్ గాయ్ ఒక్క వీడియో..

అనిత్ మార్క్ వీడియోకి హృతిక్ రోషన్ కామెంట్ పెట్టడం అంటేనే పెద్ద అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు. కచ్చితంగా అతనికి హృతిక్ నుంచి మెసేజ్ వచ్చింది కాబట్టి అతన్ను మీట్ అయ్యే ఛాన్స్ ఇంకా అలాంటి మూవ్ మెంట్స్ అదే స్టెప్స్ ఉంటే కొరియోగ్రఫీ ఛాన్స్ వచ్చినా రావొచ్చు. మొత్తానికి ఈ కార్పొరేట్ గాయ్ ఒక్క వీడియో ఇలా తనని స్టార్ ని చేస్తుందని ఊహించి ఉండడు. హృతిక్ కూడా అతని డ్యాన్స్ మూవ్స్ ని నేర్పించమని అడగడం కూడా అతని గొప్ప మనసుని చాటుతుంది.

టాలెంట్ అన్నది ఎవరి సొత్తు కాదు.. అది ఎవరి దగ్గర ఉంటే కాస్త టైం పట్టినా ఏదో ఒకరోజు అది బయటకు వస్తుంది. అంకిత్ కార్పొరేట్ జాబ్ చేస్తున్నా తనకు ఇష్టమైన డ్యాన్స్ ని వదల్లేదు. అలా వీడియోస్ చేస్తూ ఉండటంతో అది కాస్త వైరల్ అయ్యి హృతిక్ రోషన్ కి రీచ్ అయ్యేలా చేసింది. బాలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంకిత్ మార్క్ బ్యాంగ్ బ్యాంగ్ వీడియో మీరు చూశారా లేదా ఐతే మీరు కూడా అతని డ్యాన్స్ ని ఒక లుక్కేయండి.