కూలీ ట్రైలర్ లో మీమ్ స్టఫ్.. అసలు ఆ పాత్రకు బలముందా?
కానీ, ఇక్కడే కొత్త రచ్చ ప్రారంభమైంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పోషించిన అతిథి పాత్రను కూడా ట్రైలర్ వీడియోలో చూపించారు.
By: M Prashanth | 5 Aug 2025 2:00 AM ISTమోస్ట్ అవెయిటెడ్ కూలీ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సినిమాలో నటించిన కీలక పాత్రలు అన్నింటినీ ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ వింటేజ్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ఆయన స్వాగ్, గ్రాండ్ విజువల్స్, పంచ్ డైలాగ్‌లకుతోటు అనిరుధ్ అద్భుతమైన స్కోర్ తో ట్రైలర్ గ్రాండ్ గా ఆకట్టుకుంటుంది.
కానీ, ఇక్కడే కొత్త రచ్చ ప్రారంభమైంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పోషించిన అతిథి పాత్రను కూడా ట్రైలర్ వీడియోలో చూపించారు. బీస్ట్ మోడ్ లో బాడీ అంకా టాటూలతో ఉన్న ఆయన రెండు చేతులలో రెండు గన్ లను పట్టుకొని ఫైర్ చేసుకుంటూ అలా నడుస్తారు. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ట్రైలర్ లో ఆమిర్ అలా వచ్చి ఇలా వెళ్లడంతో అతని స్క్రీన్ టైమ్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందమంది నెటిజన్లు దీన్ని ట్రోల్ చేస్తు్నారు. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ ను మీమ్ లాగా మార్చేశారు. ఫన్నీగా ఉందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ, మరి కొందరు ఆయన పాత్రతు వెయిటేజీ ఉంటుందని నమ్ముతున్నారుయ. ఆయన పాత్ర సినిమాలో ట్విస్టులు ఉంటాయని, అవి కథను మలుపు తిప్పుతాయని ఆశిస్తున్నారు.
ఏదేమైనా ఈ ట్రోలింగ్ కూలీ ఎగ్జైట్ మెంట్ ను ఏ మాత్రం తగ్గించలేదు. నిజం చెప్పాలంటే ఇది ఇంకా ఆత్రుతను పెంచుతున్నట్లు కనిపిస్తోంది. లోకేష్ యూనివర్స్ లో రజనీ పాత్ర ఏ మేరకు ఫిట్ అవుతుందో.. ఆయనను డైరెక్టర్ ఎలా చూపించనున్నారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఓవరాల్ గా ట్రోలింగ్స్, విమర్శలు, ప్రశంసలు ఇలా ఏదో ఒక విధంగానైనా.. రెండ్రోజుల నుంచి కూలీ ట్రైలర్ ట్రెండింగ్ లోనే నడుస్తుంది. ఇవన్నీ కలిసి ఎక్కువ మంది మాట్లాడుకున్న ఈ ట్రైలర్ గా మార్చాయి. అయితే అమీర్ ఖాన్ అతిధి పాత్ర.. మీమ్స్, ట్రోలింగ్ తో సినిమాలో చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఈ సినిమాలో ఆమిర్ తో పాటు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, సత్యరాజ్, శ్రుతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను లోకేష్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కించారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమా నిర్మించారు. ఇది ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
