అభిమానిగానే బీడీ వెలిగించిన స్టార్ హీరో!
ఇటీవలే భారీ అంచనాల మధ్య `కూలీ` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం సంగతి పక్కన బెడితే `కూలీ`లో కొన్ని సీన్స్ మాత్రం వావ్ అనిపిస్తాయి.
By: Srikanth Kontham | 22 Aug 2025 8:00 PM ISTఇటీవలే భారీ అంచనాల మధ్య `కూలీ` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం సంగతి పక్కన బెడితే `కూలీ`లో కొన్ని సీన్స్ మాత్రం వావ్ అనిపిస్తాయి. అందులో ఒకటి బీడీ ఎలిగించే సీన్. రజనీకాంత్-అమీర్ ఖాన్-ఉపేంద్ర త్రయం ఓ సీన్ లో బీడీ వెలిగిస్తారు. ఈ సన్నివేశానికి ఒక్కసారిగా థియేటర్లు దద్ద రిల్లాయి. ముగ్గురు హీరోల అభిమానుల ఈలలు..కేకలతో మోతెక్కించారు. సినిమాకి అసలైన మాస్ సీన్ గా నిలిచింది. బీడీ ప్రియులందరికీ ఈసీన్ ఓ రేంజ్ లో కనెక్ట్ అయింది.
వావ్ అనిపించిన సీన్:
అయితే రజనీకాంత్ తో కలిసి ఈ సన్నివేశంలో నటిడంచడంపై అమీర్ ఖాన్ చిన్న వివరణ ఇచ్చారు. ఈ సీన్ లో తాను కేవలం ఓ అభిమానిగా మాత్రమే రజనీతో కలిసి వెలిగించినట్లు తెలిపారు. ఆయనతో సమాన నటుడు అనే హోదా కోసం ఈ సీన్ లో నటించలేదని..రజనీకాంత్ వీరాభిమానిగా ఆ సీన్ చేసినట్లు తెలిపారు. నిజానికి ఈ సీన్ పై ఎలాంటి విమర్శ రాలేదు. కానీ రజనీ అభిమానులు ఎక్కడైనా నొచ్చుకునే అవకాశం ఉంటుందనే ఇలాంటి వివరణతో మీడియా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
కాళ్లకు నమస్కరించిన అమీర్:
రజనీకాంత్ పై అమీర్ ఖాన్ అభిమానం ఏ రేంజ్ లో ఉందన్నది ప్రచార సమయంలోనే బయట పడింది. రజనీకాంత్ కాళ్లకు అమీర్ ఖాన్ నమస్కరించిన సంగతి తెలిసిందే. అప్పుడే రజనీ అంటే ఎంత అభిమా నమే తేట తెల్లమైంది. ఓ అభిమానిగా , పెద్దలంటే గౌరవ ప్రదంగా అమీర్ అలా చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. రజనీ, అమీర్ అభిమానులు ఎంతో సంతోషించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ ఎంత డౌన్ టూ ఎర్త్ గా ఉంటారు? అన్నది మరోసారి బటయ పడింది. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో పెద్ద స్టార్.
చిరంజీవి అయినా అంతే అభిమానం:
విదేశాల్లో సైతం భారీగా అభిమానులున్న నటుడు. ముఖ్యంగా చైనాలో అమీర్ ఖాన్ సినిమాలంటే? కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుంటాయి. రజనీకాంత్ సినిమాలకు అక్కడ అంతే డిమాండ్ ఉంది. అలాంటి లెజెండ్ ల ఇద్దరి మద్య బీడీ సన్నివేశం అన్నది లోకేష్ కనగరాజ్ గొప్పతనం. మెగాస్టార్ చిరంజీవి అయినా అమీర్ ఖాన్ అంతే గౌరవంగా ఉంటారు. చిరు అభిమానించే నటుడిగానూ ఓ సందర్భంలో పేర్కొన్నారు అమీర్. చిరంజీవి సైతం అమీర్ ఖాన్ అంటే అంతే అభిమానిస్తారు. అందుకే గిన్సీస్ వరల్డ్ రికార్డును అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు.
