Begin typing your search above and press return to search.

మొన్న కూలీ.. నేడు లోకా.. ఎందుకిలా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించిన కూలీ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   28 Aug 2025 10:23 AM IST
మొన్న కూలీ.. నేడు లోకా.. ఎందుకిలా?
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించిన కూలీ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ డ్రామాగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఆ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆగస్టు 14వ తేదీన మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది.


అయితే రిలీజ్ కు ముందు మేకర్స్.. కూలీ పోస్టర్స్ పై ఐమ్యాక్స్ లోగో వేశారు. కానీ అప్పటికి ఒప్పందం కూడా కుదరలేదు. అయినా ఐమ్యాక్స్ లో రిలీజ్ అన్నట్లు ముద్రించారు. దీంతో సరైన ఒప్పందం లేదా ఆమోదం లేకుండా అలా చేసినందుకు.. ఐమ్యాక్స్ నిర్వాహకులు కూలీ మేకర్స్ పై జరిమానా విధించినట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు మాలీవుడ్ మూవీ లోకా విషయంలో కూడా అలాంటిదే జరిగింది. మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ లీడ్ రోల్‌ లో తెర‌కెక్కుతున్న లోకా ఛాప్ట‌ర్ 1 చంద్ర తెలుగులో కూడా విడుద‌ల కానుంది. మాలీవుడ్ లో సూప‌ర్ హీరో జాన‌ర్‌ లో రూపొందుతున్న తొలి చిత్రమైన ఆ మూవీలో ప్రేమ‌లు ఫేమ్ న‌స్లేన్ ది కీలక పాత్ర.

స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ వేఫ‌రార్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, డామ్నిక్ అరుణ్ ద‌ర్వ‌క‌త్వం వహిస్తున్నారు. ఓన‌మ్ పండుగ‌ను పురస్క‌రించుకుని సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో పాన్ ఇండియాగా రేంజ్ లో రిలీజ్ కానుంది సినిమా. అయితే విడుదలకు కొన్ని రోజుల ముందు తాజాగా ఐమ్యాక్స్ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది.

లోకా మూవీ ఐమ్యాక్స్ లో విడుదల కావడం లేదని ఐమ్యాక్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ డేనియల్ తెలిపారు. అంతే కాదు.. ఐమ్యాక్స్ విడుదలంటూ ప్రకటించిన పోస్ట్‌ ను తీసివేసినందుకు మేకర్స్ కు థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు తెగ స్పందిస్తున్నారు.

సరైన ఒప్పందాలు లేదా ముందస్తు అనుమతులు లేకుండా ఐమ్యాక్స్ లోగో ఉపయోగించడం కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిర్మాతలు అటువంటి తప్పులను నివారించి, బహిరంగ ప్రకటన చేసే ముందు అవసరమైన అన్ని ఆమోదాలు ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. ఇంకోసారి అలా జరగకుండా చూసుకోవడం బెటర్ అని అంటున్నారు.