56,60తోపాటు 65 విలన్, 74 హీరో- ఈ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
By: M Prashanth | 4 Aug 2025 11:58 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే రిలీజైన మోనికా సాంగ్, ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి. ఒపెనింగ్ డే పాజిటివ్ రెస్పాన్స్, మంచి టాక్ వస్తే, సినిమా రూ.1000 కోట్లు కొట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమాకు ఇప్పటికే ఫుల్ హైప్ ఉండడమే కాకుండా.. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్రతో డైరెక్టర్ దాదాపు అన్ని ఇండస్ట్రీలు కవర్ చేశారు. ఇంతటి భారీ తారాగణం ఉండడంతో అంచనాలు మొదట్నుంచి ఎక్కువగానే ఉన్నాయి. ఇక రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో నాగార్జున లుక్, విలనిజం చూశాకా అభిమానులు ఆత్రుత ఆపుకోలేకపోతున్నారు.
అయితే ఇక్కడ ఓ విషయం గమనిస్తే, సినిమాలో నటిస్తున్న కీలత నటులందరూ సీనియర్లే. అందులో హీరోగా నటిస్తున్న రజనీకాంత్ వయసు అందరికంటే ఎక్కువ 74 ఏళ్లు కావడం విశేషం. ఆ తర్వాత నాగార్జున్ 65 ఏళ్లు, ఆమిర్ ఖాన్ 60ఏళ్లు, ఉపెంద్ర 56ఏళ్లుగా ఉన్నారు. ఇంత సీనియర్లు బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల నుంచి వచ్చే పోటీని తట్టుకొని నిలబడి రూ.1000 కోట్లు కొట్టగలరా అనే కొత్త సందేహం ప్రస్తుతం సినీ లవర్స్ కు వస్తుంది.
56, 60, 65 ఏళ్లు ఉన్న నటులు విలన్ పాత్రల్లో నటిస్తుండగా.. హీరో ఏకంగా 74ఏళ్లు. ఈ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందా అని సగటు సినీ అభిమాని ఇప్పుడు సందేహం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇంతటి సీనియర్లు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు మ్యాజిక్ చేస్తారు?.. ప్రేక్షకులను ఎంతలా అలరిస్తారు? అసలు సినిమా టాక్ ఎలా ఉంటుంది? ఎన్ని కోట్లు వసూల్ చేస్తుంది? అలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకొలంటే ఆగస్టు 14దాకా ఆగాల్సిందే!
కాగా, లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఇందులో శ్రుతి హాసన్ ఫీమేల్ లీడ్ లో నటించింది. ఆమెకు సినిమాలో నటిస్తున్న మేల్ లీడ్ అందరితోనూ సీన్స్ ఉంటాయని ఓ సందర్భంలో చెప్పింది. వీళ్లతోపాటు ఇందులో మరో నటుడు సౌబిన్ షాహిర్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ సినిమాను ఎక్కువ రీచ్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు 14 నుండి ఇది థియేటర్లలో సందడి చేయనుంది.
