కూలీలో ఆ క్లాసిక్ రిఫరెన్సులు
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న కూలీ సినిమాపై రోజురోజుకీ అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 29 July 2025 8:00 AM ISTరజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న కూలీ సినిమాపై రోజురోజుకీ అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ సినిమాపై ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్ నేపథ్యంలోనే కూలీ గురించి ఏ వార్త వినిపించినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం కూలీ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ హీరోగా వచ్చిన దీవార్ సినిమాకు సంబంధించిన రిఫరెన్సులు చాలా ఉన్నాయని తెలుస్తోంది. దీవార్ మెయిన్ లైన్, కూలీ స్టోరీ లైన్ చాలా దగ్గరగా ఉంటాయని, డైలీ కూలీల శ్రమను దోచుకుంటున్న ఓ సిండికేట్ ను ఓ మామూలు కూలీ ఎదిరించి అక్కడితో ఆగకుండా వాళ్లను తొక్కేసే స్థాయిలో మాఫియా డాన్ గా ఎదగడం, కొంత కాలమయ్యాక అతని గతం తాలూకు నీడలు మళ్లీ వెంటాడటం.. అదే కూలీ స్టోరీ అని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.
రెండూ ఒకే లైన్ తో..
కోలీవుడ్ టాక్ ను బట్టి చూస్తుంటే దీవార్ మెయిన్ లైన్, కూలీ మెయిన్ లైన్ చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే దీవార్ లోని సెకండ్ హీరో శశి కుమార్ ట్రాక్, క్లైమాక్స్ లో అమితాబ్ ప్రాణత్యాగం చేయడం వగైరాలన్నీ ఎమోషనల్ ట్రాక్ లో సాగుతాయి, కానీ కూలీ ట్రీట్‌మెంట్ సెకండాఫ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. లోకేష్ కూలీని చాలా కొత్తగా తీశారని టాక్.
ఇదేం మొదటిసారి కాదు
లోకేష్ ఇలా ఓ సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయి సీన్స్ తీయడం ఇదేం మొదటి సారి కాదు, మాస్టర్, లియో సినిమాలు కూడా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కొన్ని సీన్స్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా కూలీ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. కోలీవుడ్ కు మొదటి రూ.1000 కోట్లు అందించే సినిమాగా దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి కూలీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
