Begin typing your search above and press return to search.

కాంట్రవర్సీల్లో కూలీ సినిమా.. హాలీవుడ్ సినిమా కాపీ కొట్టారా?

రజినీకాంత్ లీడ్ రోల్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

By:  M Prashanth   |   3 Aug 2025 1:17 PM IST
Rajinikanth Coolie Faces Plagiarism Allegations Over Poster
X

రజినీకాంత్ లీడ్ రోల్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తుంది. తాజాగా సినిమా ట్రైలర్ కూడా రిలీజైంది. ఈ క్రమంలోనే కూలీ వివాదాల్లో చిక్కుకుంది.

మేకర్స్ సినిమాకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లే కాంట్రవర్సీకి దారి తీశాయి. ఇది హాలీవుడ్ కు చెందిన మడామే వెబ్ సినిమా పోస్టర్లను పోలీ ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజైన పోస్టర్ లో సినిమాలో నటిస్తున్న వాళ్ల ఫొటోలు బ్యాక్ గ్రౌండ్ లో ఒక్కొక్కటిగా ఉన్నాయి. ఈ పోస్టర్ మధ్యలో రజినీకాంత్ ఫొటో ఉంది.

అయితే దీనిపై మేకర్స్ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. కానీ, ఇది సినిమాపై తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చే ప్రమాదం ఉంది. విజువల్స కూడా కాపీనే అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీని ఇంపాక్ట్ సినిమా ప్రమోషన్స్ పై పడే ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ఇది సదరు హాలీవుడ్ సినిమాతో పోలీ ఉందా.. లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

కానీ, డైరెక్టర్ లోకేష్ మాత్రం ఒరిజినల్ కంటెంట్ ఇస్తాడని ఓ మార్క్ ఉంది. ఆయనపై ఇప్పటివరకు కాపీరైట్ కంప్లైంట్స్ ఎక్కడా లేవు. మరి ఈ పోస్టర్ ఆయన సమక్షంలోనే డిజైన అయ్యిందా.. లేదా ఆయనను సంప్రదించకుండానే గ్రాఫిక్స్ టీమ్ ఇలా క్రియేట్ చేసిందా అన్నది తెలియాలి. ఎందుకంటే లోకేష్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

చూడాలి మరి ఈ కాంట్రవర్సీ ఎక్కడ దాకా వెళ్తుందో. ఇధి సినిమా రిలీజ్ పై ఎలాంటి ప్రభాలం చూపిస్తుందో. అయితే రజినీకాంత్ అంటేనే భారీ ఓపెనింగ్స్ ఆశిస్తారు. అలానే వస్తాయి కూడా. కానీ, గత రెండు సినిమాలు ఆడకపోవడం వల్ల ఈ సినిమాలో కంటెంట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే ఈ సినిమా తొలి రోజే మంచి టాక్ దక్కించుకుంటే ఈ వివాదాలన్నీ ప్రేక్షకులు పట్టించుకోరు. ఇదంతా పెద్ద ఇంపాక్ట్ చూడా చూపించదు. అటు రజనీ- లోకేశ్ కాంబోలో తెరకెక్కిన వేట్టయాన్ ఫెయిల్ కావడంతో.. ఈ సినిమపై ఆభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.