Begin typing your search above and press return to search.

మణిరత్నం నెక్స్ట్.. సేఫ్ ప్లాన్‌ తో ముందుకెళ్తున్నారా?

భారీ బడ్జెట్లు, పాన్‌ ఇండియా హడావుడి మధ్య దర్శకుడు మణిరత్నం మాత్రం తన నెక్స్ట్ సినిమాతో మరోసారి తనదైన ప్లాన్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.

By:  M Prashanth   |   2 July 2026 11:15 AM IST
మణిరత్నం నెక్స్ట్.. సేఫ్ ప్లాన్‌ తో ముందుకెళ్తున్నారా?
X

భారీ బడ్జెట్లు, పాన్‌ ఇండియా హడావుడి మధ్య దర్శకుడు మణిరత్నం మాత్రం తన నెక్స్ట్ సినిమాతో మరోసారి తనదైన ప్లాన్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. స్టార్ కాస్టింగ్, నమ్మకమైన టెక్నికల్ టీమ్, అదుపులో ఉండే బడ్జెట్‌ తో ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తాజా పరిణామాలు చూస్తే.. ఈసారి రిస్క్ కంటే సేఫ్ ప్లాన్‌ కే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అనిపిస్తోంది.

మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటించనున్న విషయం ఇప్పటికే ఆసక్తి పెంచింది. యాక్టింగ్ తో అదరగొట్టే ఆ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించనుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కథ, ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే రొమాంటిక్ డ్రామాగా ఆ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సంగీత దర్శకుడి విషయంలో వచ్చిన ప్రచారం కూడా పెద్ద చర్చకు దారితీసింది.

ఈసారి కొత్త సంగీత దర్శకుడికి అవకాశం ఇస్తారనే వార్తలు వినిపించినప్పటికీ, లైకా ప్రొడక్షన్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఆ ఊహాగానాలకు తెరపడింది. సినిమా ఆడియో హక్కులు సోనీ మ్యూజిక్ దక్కించుకోగా, సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పేరును అధికారికంగా ప్రకటించింది. దీంతో మణిరత్నం- రెహమాన్ సూపర్ హిట్ కాంబో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

అదే సమయంలో నిర్మాణ బాధ్యతలను లైకా ప్రొడక్షన్స్‌ తో కలిసి మద్రాస్ టాకీస్ నిర్వహిస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ లేదా వందల కోట్ల బడ్జెట్ కంటే, కంట్రోల్డ్ బడ్జెట్‌ లో క్వాలిటీతో గ్రాండ్ గా సినిమాను తెరకెక్కించాలనే సేఫ్ ప్లాన్ లో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం. ప్రమోషనల్ కంటెంట్ తో ముందే బజ్ క్రియేట్ చేస్తే మంచి బిజినెస్ జరుగుతుంది. అప్పుడు టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

తక్కువ వర్కింగ్ డేస్‌ లో షూటింగ్ ను పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజయ్, సాయిపల్లవి ఇద్దరూ ప్రస్తుతం పలు కీలక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాంటి టాలెంటెడ్ క్యాస్టింగ్ ను మణిరత్నం ఒకే కథలో తీసుకురావడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. దీనికి తోడు ఎన్నో మ్యూజికల్ క్లాసిక్స్ అందించిన ఏఆర్ రెహమాన్ మరోసారి కలవడం కూడా సినిమాకు ప్రధాన బలంగా మారింది.

ఏదేమైనా మణిరత్నం ఈసారి భారీ ప్రయోగాలు కంటే తనకు ఎన్నో విజయాలు అందించిన ఫార్ములానే మరోసారి నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. స్టార్ పెర్ఫార్మర్స్, నమ్మకమైన టెక్నికల్ టీమ్, కంట్రోల్డ్ బడ్జెట్, వేగంగా పూర్తయ్యే షూటింగ్.. ఆ అంశాలన్నీ కలిసి చూస్తే ప్రాజెక్టును సేఫ్ ప్లాన్‌ తో పూర్తి చేయాలనే ఆలోచన క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఆ ప్లాన్ బాక్సాఫీస్ వద్ద కూడా సక్సెస్ అవుతుందా? లేక మణిరత్నం మరోసారి తన మార్క్ మ్యాజిక్‌ తో అంచనాలను మించి రిజల్ట్ అందిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.