కంటెంట్ ఉంటే చాలు.. ఎవరైతే మాకేంటి?
సినీ ప్రియుల అభిరుచుల్లో గత కొన్నేళ్లుగా చాలా మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, కమర్షియల్ ఫార్ములాలే సినిమాల విజయాన్ని నిర్ణయించేవి.
By: M Prashanth | 26 March 2026 10:38 PM ISTసినీ ప్రియుల అభిరుచుల్లో గత కొన్నేళ్లుగా చాలా మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, కమర్షియల్ ఫార్ములాలే సినిమాల విజయాన్ని నిర్ణయించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం స్టార్ ఇమేజ్ తో కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన అనేక సినిమాలు ఆ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి.
చిన్న హీరోలు, కొత్త దర్శకులు తీసిన కథానిర్మాణం స్ట్రాంగ్ గా ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం, ఎమోషన్స్, నేచురాలిటీ ఉంటే చాలు.. పెద్ద స్టార్ ఉన్నాడా లేదా అన్నది ప్రేక్షకులకు పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతే కాదు భాషా పరంగా కూడా ప్రేక్షకుల ఆలోచన విధానం పూర్తిగా మారిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ… ఇలా ఏ భాషలో వచ్చినా మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమా అన్ని ప్రాంతాల్లో ఆదరణ పొందుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెరుగుదలతో ఆ మార్పు మరింత వేగంగా జరిగింది. ప్రేక్షకులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలు ఈజీగా వీక్షించే అవకాశాన్ని పొందుతున్నారు. దీంతో మంచి కథలపై అవగాహన పెరిగింది.
ఇక కమర్షియల్ సినిమాల విషయంలో కూడా మార్పు కనిపిస్తోంది. పాటలు, ఫైట్లు, కామెడీ కలిపిన ఫార్ములా మాత్రమే సరిపోదు. కథలో బలం లేకపోతే ప్రేక్షకులు అంగీకరించడం లేదు. పెద్ద హీరో సినిమా అయినా సరే, కంటెంట్ వీక్ గా ఉంటే సోషల్ మీడియాలోనే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా ప్రభావం చూపుతోంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి.. నిరాశ పరుస్తున్నాయి.
మరోవైపు, కంటెంట్ బేస్డ్ సినిమాలు మాత్రం అంచనాలకు మించి విజయాలను నమోదు చేస్తున్నాయి. చిన్న బడ్జెట్ తో వచ్చినా, మంచి కథ, క్యాస్టింగ్ నటన, పక్కా టేకింగ్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకులు కూడా కొత్త కథలపై దృష్టి పెడుతున్నారు. ప్రయోగాత్మక చిత్రాలకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇండస్ట్రీ లో కొత్త టాలెంట్ కు కూడా ఇది మంచి అవకాశంగా మారింది.
కథ చెప్పే విధానం బాగుంటే చాలు.. పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అవకాశం దక్కుతోంది. ఇది సినిమా రంగానికి హెల్దీ ఎన్విరాన్మెంట్ గా భావిస్తున్నారు ఎక్స్పర్ట్స్. మొత్తానికి ప్రస్తుతం సినిమా రంగంలో కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాట మరోసారి నిజమవుతోంది. ప్రేక్షకులు చెప్పే సందేశం ఒకటే .. కంటెంట్ ఉంటే చాలు… ఎవరైతే మాకేం? అనే భావనతో సినిమాలను అంచనా వేస్తున్నారు. ఈ మార్పు భవిష్యత్తులో మరింత స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
