Begin typing your search above and press return to search.

ఇండియాలో సత్తా చాటుతున్న మరో హాలీవుడ్ మూవీ!

ఈ మధ్యకాలంలో కథ, కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా చాలా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

By:  Madhu Reddy   |   6 Sept 2025 5:00 AM IST
ఇండియాలో సత్తా చాటుతున్న మరో హాలీవుడ్ మూవీ!
X

ఈ మధ్యకాలంలో కథ, కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా చాలా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్ లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంటే .. అక్కడ హాలీవుడ్లో విడుదలైన చిత్రాలు కూడా ఇప్పుడు ఇండియాలో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ చిత్రాలు ఇండియాలో సత్తా చాటగా.. ఇప్పుడు మరో సినిమా కూడా ఇండియన్ ఆడియన్స్ హృదయాలను దోచుకోవడానికి సిద్ధమయ్యింది.

ప్రస్తుతం ఇండియాలో అద్భుతమైన థియేటర్ అనుభవాన్ని అందిస్తున్న నేపథ్యంలో హాలీవుడ్ చిత్రాలకు ఆదరణ పెరిగింది. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్, F1, జురాసిక్ వరల్డ్ : రీబర్త్ తో పాటు సూపర్ మ్యాన్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఇండియాలో కూడా భారీ రెస్పాన్స్ తో విడుదలైన చిత్రం ' కన్జురింగ్ : ది లాస్ట్ రైట్స్'. ఎన్నో అంచనాల మధ్య హాలీవుడ్ లోనే కాకుండా ఇటు ఇండియాలో కూడా ఈ సినిమా విడుదల అయ్యి ఇండియన్ ఆడియన్స్ ను ఇప్పుడు విపరీతంగా అలరిస్తోంది.. ఈ కన్జురింగ్ : ది లాస్ట్ రైట్స్ మూవీ అనేది కన్జురింగ్ ఫ్రాంఛైజీలో చివరి భాగం కావడం గమనార్హం.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి ముందస్తుగానే టికెట్ బుకింగ్ ప్రారంభం అవ్వగా ఈరోజు మెట్రో తో పాటు వివిధ నగరాలలో చాలా టికెట్స్ అమ్ముడుపోయాయి. పైగా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కన్జురింగ్ ఫోర్ ఇండియన్ థియేటర్ వద్ద చాలా గొప్పగా ప్రారంభం అయిందని చెప్పవచ్చు. అంతేకాదు తాజాగా టికెట్స్ సేల్ అవుతున్న విధానాన్ని బట్టి చూస్తే మొదటి రోజే రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని నెటిజన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా హారర్ సినిమాలు మంచి థియేటర్ అనుభవాన్ని అందిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది కన్జురింగ్ విజయవంతమైన హారర్ జానర్లో వచ్చిన మొదట రెండు భాగాలుగా మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన మూడవ భాగం మాత్రం యావరేజ్ గా ముగిసింది. కానీ ఇప్పుడు రాబోతున్న ' కన్జురింగ్: ది లాస్ట్ రైట్స్' మాత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకోబోతోందని సమాచారం. దీనికి తోడు ఇప్పుడు ఈ లాస్ట్ సీజన్ పై కూడా ఇండియాలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఒకవేళ ఈ సినిమా మంచి టాక్ ను గనుక దక్కించుకోగలిగితే F1, జురాసిక్ వరల్డ్ లాగా మరో రూ.100 కోట్ల గ్రాస్ మూవీగా నిలుస్తుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5 అనగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ మూవీ గా వచ్చిన ఈ చిత్రానికి మైఖేల్ చేవ్స్ దర్శకత్వం వహించారు.