డబ్బుతో నారాయణ మూర్తిని కొనలేం!
విప్లవ చిత్రాల దర్శకుడు, నటుడు, కామ్రేడ్ ఆర్ . నారాయణ మూర్తి ముక్కు సూటి తత్వం గురించి తెలిసిందే.
By: Srikanth Kontham | 12 Aug 2025 11:20 AM ISTవిప్లవ చిత్రాల దర్శకుడు, నటుడు, కామ్రేడ్ ఆర్ . నారాయణ మూర్తి ముక్కు సూటి తత్వం గురించి తెలిసిందే. విమర్శ అయినా? ప్రశంస అయినా? స్ట్రెయిట్ గా ఉంటుంది. తనకు తప్పు అనిపించిందంటే తప్పు అని ఒప్పు అనిపించిందంటే? ఒప్పు అని అంతే ధీటుగా మాట్లాడుతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోలా మాట్లాడే తత్వం గల వారు కాదు. తన వ్యక్తిత్వాన్నే తన సినిమా కథలుగా ఎన్నో చిత్రాల్లో ఆవిష్క రించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంత మంది డైరెక్టర్లు ఎలాంటి సిని మాలు తీసినా? నారాయణమూర్తిలా సినిమా తీయలేరు అన్నది అంతే వాస్తవం. డైరెక్టర్ గా ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన సినిమాలుంటాయి. ఇటీవలే కేంద్రం మావోయి స్టులపై కాల్పులకు తెగబడిన నేపథ్యంలో? ప్రశ్నించిన వారిని పొట్టనబెట్టుకుంటారా? అంటూ గళ మెత్తారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గానూ మారాయి. తాజాగా నారాయణ మూర్తి తీసిన `యూనివర్సిటీ పేపర్ లీక్` చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ వీక్షించారు. అనంతరం మూర్తిగారిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `నారాయణ మూర్తి వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన సినిమాల్లో ఆయనే రాజు.. మంత్రి...సైన్యాధిపతి` అన్నారు.
కథాలోచన నుంచి సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం ఆయనే చేస్తారన్నారు. ప్రతీ సిని మాలోనూ సామాజికంగా ఏదో ప్రయోజనం ఉండేలా సినిమాలు చేయడం ఆయనకే సాధ్య మైందన్నారు. అణిచివేతకు గురైన వారి తరుపున మాట్లాడేందుకు ఉన్న ఓ గొంతు ఆయనది. అది అందరికీ వినబడేలా ఆయన ప్రయత్నిస్తారు. అది కొందరికి నచ్చొచ్చు..నచ్చకపోవచ్చు. కానీ ఇలాంటి వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రపంచంలో ఏకపక్ష ధోరణి నెలకొంటుందన్నారు.
రాజీ పడకుండా బ్రతకడం అందరికీ సాధ్యం కాదని...తాను మాత్రం చాలాసార్లు రాజీ పడ్డాన్నారు. మూర్తి గారి గురించి మరో మాట కూడా విన్నాను. సినిమాలో ఓ పాత్ర కోసం ఆయన్ని అనుకున్నాను. కానీ ఆయ న్ని పారితోషికంతో కొనలేమని ఎవరో? అనడంతో నా ఆలోచన విరమించుకున్నాన`న్నారు. `టెంపర్` చిత్రంలో పోసాని కృష్ణమూరణి పోషించిన కానిస్టేబుల్ పాత్రను పూరి జగన్నాధ్ ముందుగా మూర్తికే ఆఫర్ చేసారు. కానీ ఆ అవకాశాన్ని నారాయణ మూర్తి సున్నితంగా తిరస్కరించారు. అధిక పారితోషికం ఆపర్ చేసినా నో చెప్పిన నటుడాయన. దీంతో ఆ పాత్ర బాధ్యతలు పూరి పోసానికి అప్పగించారు.
