Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు 'కామ్రెడ్ కళ్యాణ్' టీజర్ టాక్..!

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు తన లేటెస్ట్ సినిమా టైటిల్ టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు.

By:  Ramesh Boddu   |   2 Oct 2025 2:47 PM IST
శ్రీవిష్ణు కామ్రెడ్ కళ్యాణ్ టీజర్ టాక్..!
X

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు తన లేటెస్ట్ సినిమా టైటిల్ టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు. సింగిల్ సూపర్ హిట్ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో శ్రీవిష్ణు సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాకు కామ్రెడ్ కళ్యాణ్ అనే టైటిల్ ని లాక్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తే 1992 బ్యాక్ డ్రాప్ విశాఖపట్నంలో జరిగిన కథగా చూపించారు. ఇక పవర్ ఫుల్ రోల్ లో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు.


శ్రీవిష్ణు కామ్రెడ్ డ్రెస్ చేతిలో తుపాకీ..

కామ్రెడ్ కళ్యాణ్ గా శ్రీవిష్ణు కామ్రెడ్ డ్రెస్ చేతిలో తుపాకి లుక్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమాను జానకిరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ టీజర్ చూస్తే చాలా సీరియస్ గా ఉంది. కానీ శ్రీవిష్ణు మార్క్ కామెడీ అసలు మిస్ అవ్వదని మేకర్స్ చెబుతున్నారు. టీజర్ లో సినిమా కథ పూర్తిగా రివీల్ చేయలేదు కానీ కామ్రెడ్ కళ్యాణ్ టీజర్ మాత్రం ఇంప్రెస్ చేసింది.

శ్రీవిష్ణు ఈ కథతో కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు. శ్రీవిష్ణు కామ్రెడ్ కళ్యాణ్ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. కోనా వెనట్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాను వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు.

ఎంటర్టైన్ చేయడమే మెయిన్ టార్గెట్..

టైటిల్ టీజర్ అయితే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా టీజర్ లో శ్రీవిష్ణు తన వాంటెడ్ పోస్టర్ ని తానే గోడకి అంటించడం ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. చూస్తుంటే శ్రీవిష్ణు మరో సూపర్ హిట్ నవ్వుల రైడ్ కి సిద్ధమై వస్తున్నాడని అనిపిస్తుంది. తన ప్రతి సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్న శ్రీవిష్ణు తప్పకుండా అందులో సక్సెస్ అయ్యేలా ఉన్నాడు.

శ్రీవిష్ణు ఎంచుకున్న కథ ఎలాంటిదైనా సరే అందులో కామెడీ కంపల్సరీ ఉంటుంది. ఇతని సినిమాలు కచ్చితంగా నవ్విస్తాయ్ అన్న నమ్మకాన్ని ఆడియన్స్ లో కల్పించాడు శ్రీవిష్ణు. సామజవరగమన సినిమా తర్వాత మళ్లీ సింగిల్ తో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు కామ్రెడ్ కళ్యాణ్ నెక్స్ట్ సామజవరగమన డైరెక్టర్ తో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు. శ్రీవిష్ణు తో పనిచేస్తున్న డైరెక్టర్స్ కూడా అతన్ని పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు. అంతేకాదు నానిలానే శ్రీవిష్ణు కూడా కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ వారితో మంచి అవుట్ పుట్ వచ్చేలా చేస్తున్నాడు.