కామ్రేడ్ కళ్యాణ్.. ఫస్ట్ డే లెక్క ఎంతంటే?
అయితే శ్రీ విష్ణు సినిమాలకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం కంటే.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, నవ్వించి పంపించడం మెయిన్.
By: M Prashanth | 10 Oct 2026 10:03 AM ISTయంగ్ హీరో శ్రీ విష్ణు సినిమాలకు ఉండే క్రేజే వేరు. స్టోరీలో కొత్తదనం, నవ్వించే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. మరోసారి అదే తరహా ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన యాక్ట్ చేసిన కామ్రేడ్ కళ్యాణ్ మూవీ అక్టోబర్ 9వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజైంది. ఇప్పుడు తొలి రోజు వసూళ్లను చూస్తే శ్రీ విష్ణు మార్కెట్‌కు తగ్గట్టుగా సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకున్నట్లు కనిపిస్తోంది.
ట్రేడ్ పండితులు అంచనా ప్రకారం, కామ్రేడ్ కళ్యాణ్ మొదటి రోజు ఇండియాలో సుమారు రూ.2.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. నెట్ వసూళ్లు దాదాపు రూ.2.10 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే శ్రీ విష్ణు సినిమాలకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం కంటే.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, నవ్వించి పంపించడం మెయిన్.
ఆయన గత చిత్రాలు కూడా కామెడీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ఆ నమ్మకమే కామ్రేడ్ కళ్యాణ్ కు ఉపయోగపడినట్లు కనిపిస్తోంది. మొదట్లో వసూళ్లు స్లోగా మొదలైనా, ఈవెంట్ అండ్ నైట్ షోల్లో ఆక్యుపెన్సీ పెరిగినట్లు తెలుస్తోంది. ఇక 1990ల నాటి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా కథ సాగుతుంది. ఓ థియేటర్ ను నడిపించే కళ్యాణ్ జీవితం అనుకోని పరిస్థితుల్లో ఎలా మారుతుంది, అతడు పోలీసులకు ఎందుకు కావాల్సి వస్తుంది అనే అంశాలతో కథను రూపొందించారు.
నక్సలిజం బ్యాక్ డ్రాప్ కు లవ్ స్టోరీ, కామెడీ యాడ్ చేశారు. శ్రీ విష్ణు తనదైన యాక్టింగ్ తో మరోసారి ప్రేక్షకులను నవ్వించగా, సత్య కామెడీ కూడా సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచినట్లు ప్రేక్షకుల రెస్పాన్స్ బట్టి తెలుస్తోంది. కొన్ని సన్నివేశాల్లో వీరిద్దరి కామెడీ బాగా పేలింది. అయితే స్టోరీని మరింత స్ట్రాంగ్ గా నడిపించి ఉంటే సినిమా ఇంకాస్త మెరుగ్గా ఉండేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
సినిమాలో టెక్నికల్ వాల్యూస్ కోసం చెప్పాల్సిన పనిలేదు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. విలేజ్ అండ్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సీన్స్ ఎంతో నేచురల్ గా అదిరిపోయేలా డిజైన్ చేశారు. తన వర్క్ తో ఫిదా చేశారు. విజయ్ బుల్గేనిన్ పాటలు ఒక మోస్తరుగా అనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా సెట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఏమి ఢోకా లేకుండా, మంచి క్వాలిటీతో చూపించారు.
ఇక తొలి రోజు వచ్చిన వసూళ్లు మూవీ టీమ్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి. ఇప్పుడు శని, ఆదివారాల్లో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే శ్రీ విష్ణు మార్కెట్ ను లెక్కలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల గ్రాస్ తో మొదలుపెట్టడం చెప్పుకోదగ్గ విషయమే. మరి ఫుల్ రన్ లో సినిమా ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.
