శ్రీవిష్ణు.. రణబాలి, జైలర్ 2తో రిస్క్ ఉన్నా..
ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్లు మూవీ టీమ్ తెలిపింది. అంటే సినిమా కోసం పెట్టిన డబ్బు తిరిగి వచ్చే రేంజ్ కు చేరినట్లు అర్థం.
By: M Prashanth | 13 Oct 2026 3:24 PM ISTపెద్ద సినిమాల పోటీ మొదలవకముందే తన సినిమాతో మంచి వసూళ్లు సాధించారు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన కామ్రేడ్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.19.8 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ రీసెంట్ గా ప్రకటించింది. అప్పుడే బ్రేక్ ఈవెన్ పై కూడా అప్డేట్ ఇచ్చింది. ఫస్ట్ వీకెండ్ కే ఇన్వెస్ట్మెంట్ తిరిగి వచ్చిందని తెలిపింది. అయితే త్వరలో రణబాలి, జైలర్ 2 వంటి పెద్ద సినిమాలు పోటీలోకి రానున్నాయి. అందుకే శ్రీవిష్ణు సినిమా వసూళ్లు ఎలా ఉంటాయనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది.
శ్రీవిష్ణు సినిమాల్లో కామెడీకి స్పెషల్ క్రేజ్ ఉంది. కామ్రేడ్ కల్యాణ్ కూడా నవ్వులు పంచే సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో సత్యతో కలిసి శ్రీవిష్ణు చేసిన కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. దసరా సెలవులు కూడా సినిమాకు కలిసొచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంతో మొదటి మూడు రోజుల్లోనే రూ.19.8 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. నాలుగో రోజు మండే కూడా మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్లు మూవీ టీమ్ తెలిపింది. అంటే సినిమా కోసం పెట్టిన డబ్బు తిరిగి వచ్చే రేంజ్ కు చేరినట్లు అర్థం. మూడు రోజుల్లోనే ఆ టార్గెట్ చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో సినిమా బాక్సాఫీస్ జర్నీపై అంచనాలు పెరిగాయి. మూవీ కోసం పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చిన తర్వాత వచ్చే వసూళ్లు లాభాలను పెంచుతాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి లెక్కలు బయటకు రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ రూ.5 కోట్ల రీఫండబుల్ అడ్వాన్స్ చెల్లించినట్లు సమాచారం.
బ్రేక్ ఈవెన్ పూర్తయిందని మేకర్స్ చెబుతున్న నేపథ్యంలో.. ఇకపై సినిమా ఎంత వసూలు చేస్తుందనేది ముఖ్యం. మొదటి వారంలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కామ్రేడ్ కళ్యాణ్ కు కలిసొచ్చింది. దీంతో థియేటర్లలో మంచి వసూళ్లు సాధించే అవకాశం దక్కింది. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి మారవచ్చు. త్వరలో విజయ్ దేవరకొండ రణబాలి, రజనీకాంత్ జైలర్ 2 వంటి పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలు విడుదలైతే థియేటర్లలో పోటీ పెరుగుతుంది. కొత్త మూవీలకు ఎక్కువ థియేటర్లు కేటాయిస్తే కామ్రేడ్ కల్యాణ్ కు స్క్రీన్లు తగ్గే అవకాశం ఉంది.
దీంతో రోజువారీ వసూళ్లపైనా ఎఫెక్ట్ పడవచ్చు. అయితే పోటీ మొదలయ్యేలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించడం ఆ సినిమాకు రిలీఫ్ ఇచ్చే విషయం. ఇకపై రణబాలి, జైలర్ 2తో రిస్క్ ఉన్నా.. వసూళ్లు తగ్గినా.. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు సినిమాకు ఉపయోగపడతాయి. అదే సమయంలో థియేటర్లలో సినిమా కొనసాగితే మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్ద సినిమాల పోటీని తట్టుకుని ఎంతవరకు వసూళ్లు సాధిస్తుందనేదే చూడాలి. శ్రీవిష్ణు మూవీకి మరిన్ని లాభాలు వస్తాయా.. లేక పోటీ కారణంగా వసూళ్లు తగ్గుతాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
