Begin typing your search above and press return to search.

సత్య జర్నీలో ఆ 'అన్న' సపోర్ట్

ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న ఆత్మీయ బంధాల గురించి సత్య చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

By:  M Prashanth   |   2 May 2026 5:50 PM IST
సత్య జర్నీలో ఆ అన్న సపోర్ట్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నటుడు ఎదగాలంటే టాలెంట్ తో పాటు తోటి నటీనటుల సపోర్ట్ కూడా చాలా అవసరం. కమెడియన్ సత్య ఇవాళ ‘జెట్ లీ’ లాంటి సినిమాలతో లీడ్ రోల్స్ చేసే స్థాయికి వచ్చారంటే అతని వెనుక చాలా మంది ప్రోత్సాహం ఉంది. ముఖ్యంగా కష్టకాలంలో అండగా నిలిచి, ధైర్యం చెప్పిన కొందరు వ్యక్తుల గురించి సత్య తాజాగా ఓపెన్ అయ్యారు. ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న ఆత్మీయ బంధాల గురించి సత్య చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

జెట్ లీ సినిమా రీసెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అంటూ మేకర్స్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్ లో సత్య ఎమోషనల్ గా మాట్లాడారు. సత్య మాట్లాడుతూ.. తన కెరీర్ లో ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు చాలా మంది నుంచి సపోర్ట్ లభించిందని చెప్పారు. "నేను హీరో అవుతున్నానంటే నా తోటి హీరోల నుంచి, కో ఆర్టిస్టుల నుంచి వచ్చిన సపోర్ట్ మర్చిపోలేను" అని ఆయన కృతజ్ఞతగా పేర్కొన్నారు.

తన జర్నీలో ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ, ఫోన్ చేసి తన బాగోగులు తెలుసుకునే వ్యక్తుల గురించి ఆయన ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా నటుడు అజయ్ గురించి సత్య మాట్లాడుతూ.. ఆయన తనకి సొంత అన్నలాంటి వారని చెప్పారు. "నేను ఎప్పుడైనా డౌన్ లో ఉన్నా లేక ఒక సినిమా ప్లాప్ అయిందని డల్ గా ఉన్నా.. అజయ్ అన్న వెంటనే ఫోన్ చేసి చాలా ధైర్యం చెప్పేవారు" అని సత్య వెల్లడించారు.

అజయ్ తనకి ఇచ్చే ఆ ధైర్యం వల్లే తను మళ్ళీ పుంజుకోగలిగానని సత్య గుర్తు చేసుకున్నారు. అజయ్ ఎప్పుడూ తన పక్కనే ఉండి, ఒక అన్నలా గైడ్ చేస్తూ ఉంటారని సత్య ఎంతో ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. సత్య కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ, ప్రతి అడుగులోనూ ఇలాంటి సపోర్ట్ ఉండటం వల్ల మరింత కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తున్నారు. సత్యకు ఇండస్ట్రీలోని అందరితోనూ మంచి రిలేషన్ ఉంది అనడానికి ఈ మాటలే నిదర్శనం.

ఒక నటుడిగా తన బాధ్యతను తెలుసుకుంటూనే, తనకి సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోకుండా ఇలా పబ్లిక్ గా గుర్తు చేసుకోవడం సత్య గొప్పతనమే అని చెప్పాలి. ఈ పాజిటివ్ వైబ్స్ ఆయన కెరీర్ కి ఇంకా ఎంతో ప్లస్ అవుతాయని అనిపిస్తోంది. సత్య ‘జెట్ లీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నారు. సత్య కమెడియన్ గానే కాకుండా, లీడ్ రోల్స్ లో కూడా తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. మరి రాబోయే రోజుల్లో సత్య ఎలాంటి ప్రయోగాలు చేస్తారో చూడాలి.