క్రేజీ కాంబో.. విమానంపై జెట్లీ సత్య!
ఈ పోస్టర్ సత్య కొత్త సినిమాది. టైటిల్ కూడా పోస్టర్‌కు ఏమాత్రం తగ్గకుండా "జెట్లీ" అని పెట్టారు.
By: M Prashanth | 14 Nov 2025 5:22 PM ISTఓ విమానం మీద కూర్చుని వింత పోజులో ఉన్న ఓ హీరో పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అసలు ఎవరీ హీరో, ఏంటి ఈ గెటప్ అని ఆశ్చర్యంగా చూస్తే, అక్కడ కనిపించింది మనందరికీ సుపరిచితుడైన కామెడీ స్టార్ సత్య. ఈ ఒక్క లుక్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ వింత గెటప్ వెనుక అసలు కథేంటి అనే వివరాల్లోకి వెళితే..
ఈ పోస్టర్ సత్య కొత్త సినిమాది. టైటిల్ కూడా పోస్టర్‌కు ఏమాత్రం తగ్గకుండా "జెట్లీ" అని పెట్టారు. అయితే, పోస్టర్‌పై ఉన్న అసలు షాక్ టైటిల్ కాదు. నేను కామెడీకి దూరమవుతున్నా అని ఒక లైన్ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనదైన టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించిన సత్య, ఇప్పుడు కామెడీ చేయనని చెప్పడమేంటని అభిమానులు షాక్ అయ్యారు.
ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి ఒక్క పేరుతో సమాధానం దొరికింది. అదే డైరెక్టర్ రితేష్ రానా. 'మత్తు వదలరా' సిరీస్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఒక యూనిక్, క్రేజీ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న రితేష్ రానానే ఈ సినిమాకు దర్శకుడు. గతంలో సత్యతో మెగాస్టార్ చిరంజీవి స్టైల్‌లో డ్యాన్సులు వేయించిన ఘనత కూడా రితేష్‌దే. ఇప్పుడు అదే క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది.
రితేష్ రానా సినిమాలో కామెడీ ఉండకుండా ఉంటుందా? అందుకే, కామెడీకి గుడ్ బై అనేది కూడా ఆ 'గందరగోళం'లో ఒక భాగమేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. పోస్టర్‌పై "రితేష్ రానాస్ టర్బులెన్స్" అని ఉండటం, టైటిల్ "జెట్ లీ" అని పెట్టడం చూస్తుంటే, ఇది మామూలు కామెడీ కాదు.. స్టైలిష్ యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు కలిపిన ఒక డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది. సత్యను ఒక కొత్త యాక్షన్ కామెడీ స్టార్‌గా రితేష్ రానా మళ్లీ పరిచయం చేస్తున్నాడు.
ఈ పోస్టర్‌ను నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రిలీజ్ చేస్తూ, హ్యాపీ చిల్డ్రన్స్ డే అని విషెస్ చెప్పడం మరో ఆసక్తికరమైన అంశం. దీన్నిబట్టి ఈ సినిమా యాక్షన్, థ్రిల్ ఎంత ఉన్నా.. పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా క్లీన్, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని మేకర్స్ హింట్ ఇచ్చారు.
ఈ క్రేజీ కాంబినేషన్‌కు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ అండగా నిలుస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో బజ్ పెరిగింది. మరి ఈ సారి రితేష్ రానా ఎలాంటి ట్విస్టులు ఇస్తాడో చూడాలి.
