పక్షవాతపడ్డ స్టార్ కమెడియన్.. పరిస్థితి దారుణం!
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఒక కమెడియన్ దీనస్థితి బయటపడింది. పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
By: Madhu Reddy | 21 Aug 2025 10:14 AM ISTపక్షవాతంతో బాధపడుతున్న స్టార్ కమెడియన్..
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఒక కమెడియన్ దీనస్థితి బయటపడింది. పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.మరి ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదు.. వెంకీ, దుబాయ్ శీను, ఆనందం, లౌక్యం, కింగ్, సొంతం వంటి ఎన్నో సినిమాల్లో తన కామెడీతో మెప్పించిన రామచంద్ర.. ఈయన పేరు వినగానే ఎక్కువమందికి వెంకీ సినిమానే గుర్తుకొస్తుంది. వెంకీ సినిమాలో రవితేజ ముగ్గురు ఫ్రెండ్స్ లో ఈయన కూడా ఒకరు. అయితే అలాంటి రామచంద్ర పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. ఆయనకి రీసెంట్ గా పక్షవాతం రావడంతో ఎడమ కాలు, ఎడమ చెయ్యి పూర్తిగా పడిపోయి.. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై పోయారు.. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. నేను రీసెంట్ గా మీ దగ్గరికి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు.. ఇంతలోనే ఏమైందని ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అడిగారు.
బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్..
దాంతో రామచంద్ర మాట్లాడుతూ.. "అంతా బాగానే ఉంది. కానీ రీసెంట్ గా నా ఫ్రెండ్ డెమో షూట్ కోసం ఒక 15 రోజుల క్రితం వెళ్ళాను. అక్కడ షూటింగ్ చేస్తుండగా.. సడన్ గా కాలు, చేయి నొప్పి వచ్చింది. దాంతో హెల్త్ బాలేదని ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత బీపీ బాగా పెరిగిపోయింది. అప్పటికే నాకు పెరాలసిస్ అటాక్ అయింది.కానీ నేను గమనించలేదు. ఆ తర్వాత రెండు రోజులకు ఫ్యామిలీ డాక్టర్ కి చూపిస్తే సిటీ స్కాన్ చేశారు. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని తెలిపారు. ఆ తర్వాత ఎడమ కాలు, ఎడమ చేయి పడిపోయింది. రెండు నెలలపాటు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. అలాగే డైలీ ట్రీట్మెంట్ తో పాటు ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలన్నారు. అయితే ఇప్పటివరకు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి.
ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు..
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ లో మెంబర్ అవ్వడం వల్ల కొంత డబ్బులు సెటిల్ అయ్యాయి. కానీ ట్రీట్మెంట్ కోసం మరిన్ని డబ్బులు కావాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న డబ్బులన్ని అయిపోయాయి. ప్రస్తుతం ఎవరైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు రామచంద్ర. అంతేకాకుండా తన పరిస్థితి తెలిసి ఇప్పటి వరకు ఎవరూ కూడా తనకు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని అడగలేదని కూడా బాధపడ్డారు.
ఇండస్ట్రీ నుండి ఎవరైనా స్పందిస్తారా?
ప్రస్తుతం కమెడియన్ రామచంద్ర పరిస్థితికి సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది అభిమానులు ఈయన పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. ఒకప్పుడు తన కామెడీతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన రామచంద్ర.. ప్రస్తుతం ఇలాంటి స్థితిలో ఉండడం నిజంగా బాధాకరం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని.. తోచినంత సహాయం చేయాలని కోరుకుంటున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరైనా ముందుకు వచ్చి కమెడియన్ రామచంద్రకు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తారా? అన్నది చూడాలి.
