మోస్ట్ అవైటెడ్ మూవీ జాబితాలో సీక్వెల్..!
షాహిద్ కపూర్ హీరోగా కృతి సనన్, రష్మిక మందన్న హీరోయిన్స్‌గా నటిస్తున్న మూవీ ఇటీవలే పట్టాలెక్కింది.
By: Ramesh Palla | 30 Aug 2025 7:00 PM ISTషాహిద్ కపూర్ హీరోగా కృతి సనన్, రష్మిక మందన్న హీరోయిన్స్‌గా నటిస్తున్న మూవీ ఇటీవలే పట్టాలెక్కింది. ఈ ముగ్గురు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను బట్టి చూస్తూ ఉంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది, కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని అర్థం అవుతుంది. ఈ సినిమాకు హోమి అడజానియా దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌లుగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా షాహిద్ కపూర్ వంటి రొమాంటిక్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటించడం వల్ల ఖచ్చితంగా ఒక మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా నిలుస్తుంది అనే విశ్వాసంను ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.
కాక్‌టెయిల్ 2 షూటింగ్ ప్రారంభం
ఈ సినిమాకు కాక్‌టెయిల్ 2 అనే టైటిల్‌ను దాదాపుగా కన్ఫర్మ్ చేశారని చెప్పాలి. లవ్ రంజన్ ఈ సినిమాకు రచన సహకారం అందిస్తున్నారు. మాడక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ ప్రాంచైజీ మూవీలో మొదట కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. కానీ ఆమె గర్భం దాల్చడం వల్ల మరో హీరోయిన్ వచ్చి చేరిందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా 2012లో వచ్చిన కాక్‌టెయిల్ సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఆ సినిమా కథకు, పాత్రలకు ఈ సినిమా కథకు, పాత్రలకు సంబంధం ఉండదని, ఆ ప్రాంచైజీలో మాత్రమే ఈ సినిమా రూపొందుతోంది అంటూ అనధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పకనే చెప్పారు.
షాహిద్ కపూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్
ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకులు చెప్పిన విషయాల అనుసారం ఇటీవల షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాను 2026 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ లోపు సినిమాను విడుదల చేయడం ద్వారా షాహిద్ కపూర్ తన అభిమానులకు స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో మళ్లీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌కి ఆధరణ పెరుగుతోంది. సయ్యార సినిమా ఏ స్థాయిలో వసూళ్లు సాధించిందో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ సినిమాను సైతం రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్ వస్తుందని, అదే సమయంలో విడుదల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కృతి సనన్, రష్మిక మందన్న హీరోయిన్స్‌గా..!
షాహిద్ కపూర్ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఇక హీరోయిన్స్ కృతి సనన్ ఇటీవలే ధనుష్ తో కలిసి తేరే ఇష్క్ మే సినిమాను పూర్తి చేసింది. ఆ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించాడు. మరో వైపు రష్మిక సైతం పుష్ప 2 తో బాలీవుడ్‌లో స్టార్‌డం దక్కించుకుంది. అందుకే సికిందర్ సినిమాలో నటించింది. ఆ సినిమా నిరాశ పరచడంతో బాలీవుడ్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. అందుకే ఈ సినిమా విషయంలో రష్మిక చాలా ఆలోచించి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. షాహిద్ కపూర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు, కాక్‌టెయిల్ 2 సినిమా సైతం సమాంతరంగా షూటింగ్ జరగనుంది. వచ్చే ఏడాదిలో కాక్‌టెయిల్ 2 సినిమాను విడుదల చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
