Begin typing your search above and press return to search.

రష్మిక మందన్న కొత్త రికార్డుపై కన్ను!

హీరోయిన్ల కెరీర్ పెళ్లి తర్వాత ముగిసిపోతుందనే? ఆలోచనలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి.

By:  Srikanth Kontham   |   7 May 2026 1:00 AM IST
రష్మిక మందన్న కొత్త రికార్డుపై కన్ను!
X

హీరోయిన్ల కెరీర్ పెళ్లి తర్వాత ముగిసిపోతుందనే? ఆలోచనలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా బాలీవుడ్ వంటి పెద్ద మార్కెట్‌లో జెండా పాతడం కొత్త ట్రెండ్‌గా మారింది. `జవాన్`` సినిమాతో నయనతార సృష్టించిన రికార్డులే దీనికి నిదర్శనం. ఇప్పుడు అదే బాటలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. రష్మిక మందన్న -విజయ్ దేవరకొండ ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ర‌ష్మిక న‌టిస్తోన్న‌ మొదటి బాలీవుడ్ చిత్రం కావడంతో `కాక్టెయిల్ 2` పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జూన్ 19న విడుదలవుతున్న ఈ సినిమాతో రష్మిక హిందీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో దీపికా పదుకొనేకు మంచి బ్రేక్ ఇచ్చిన `కాక్టెయిల్` ఫ్రాంచైజీలో రష్మిక భాగం కావడం ఆమె కెరీర్‌కు ప్లస్ పాయింట్ గా మారుతుంది.నయనతార పెళ్లి తర్వాత షారుఖ్ ఖాన్ సరసన నటించి(జ‌వాన్) సెన్సేషన్ సృష్టించినట్లుగానే రష్మిక కూడా ఈ సీక్వెల్‌లో షాహిద్ కపూర్, కృతి సనన్ వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. పెళ్లి అనేది ఒక నటి సృజనాత్మకతకు అడ్డంకి కాదని నిరూపించడానికి ఆమె ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

బాలీవుడ్ మేకర్స్ కూడా రష్మికలోని టాలెంట్‌ను గుర్తించి ఆమెకు వైవిధ్యమైన పాత్రలను ఆఫర్ చేస్తున్నారు.

`కాక్టెయిల్ 2` చిత్రంలో రష్మిక పాత్ర ఎంతో గ్లామరస్‌గా, ఎమోషనల్‌గా ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత ఆమెలో వచ్చిన ఆ కొత్త వెలుగు , పరిణతి వెండితెరపై మ్యాజిక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా హిట్టయితే? పెళ్లి తర్వాత కూడా బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే సౌత్ హీరోయిన్ల జాబితాలో ఆమె అగ్రస్థానానికి చేరుకుంటుంది.

టాలీవుడ్, కోలీవుడ్‌లో సత్తా చాటిన రష్మికకు హిందీలో నిలదొక్కుకోవడం అత్యంత‌ ముఖ్యం. `పుష్ప 2' సక్సెస్ ఎలాగూ ఆమె వెంటే ఉన్నా? సోలో బాలీవుడ్ హిట్ ఆమె ఇమేజ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తుంది. నయనతార బాటలో పయనిస్తూ? పెళ్లి తర్వాత కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించడానికి `కాక్టెయిల్ 2` హిట్ అనేది వేదికగా భావిస్తోంది. ఈ సినిమా రిజల్ట్ కోసం రష్మికతో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నారు.

పెళ్లి తర్వాత హీరోయిన్ల సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు గోల్డెన్ ఇన్నింగ్స్‌గా మారుతోంది. రష్మిక మందన్నా తన ప్రతిభతో బాలీవుడ్‌లో కొత్త రికార్డులను తిరగరాయాలని పట్టుదలతో ఉంది. జూన్ 19న విడుదలవుతున్న‌ చిత్రం ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందా? లేదా? అన్న‌ది చూడాలి. ఏదేమైనా? నయనతార రికార్డుణ‌/ అందుకోవడానికి రష్మికకు అన్ని అర్హతలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.