Begin typing your search above and press return to search.

కాక్ టెయిల్2 'అల్లీ' లుక్‌లో కృతి సనన్ రచ్చ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

"అల్లీ క్యారెక్టర్ నాకు ఒక విషయం నేర్పింది.. హాట్‌గా ఉండటం, బ్యూటిఫుల్‌గా ఉండటం వేర్వేరు కాదు, రెండు కలిస్తేనే అల్లీ" అంటూ కృతి పేర్కొన్నారు.

By:  Madhu Reddy   |   17 Jun 2026 6:00 AM IST
కాక్ టెయిల్2 అల్లీ లుక్‌లో కృతి సనన్ రచ్చ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
X

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించిన క్రేజీ రోమాంటిక్ కామెడీ డ్రామా ‘కాక్ టెయిల్ 2’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఆమె ‘అల్లీ’ అనే చాలా డిఫరెంట్, బోల్డ్ క్యారెక్టర్‌ను ప్లే చేశారు. రీసెంట్‌గా విడుదలైన ఈమె లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో తనను ఇంత అందంగా, హాట్‌గా చూపించిన తన కాస్ట్యూమ్ డిజైనర్స్, మేకప్ టీమ్, మరియు డైరెక్టర్‌కు థాంక్స్ చెబుతూ కృతి సనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

‘అల్లీ’ లుక్‌కు సూపర్ రెస్పాన్స్:

షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి కృతి సనన్ నటించిన ‘కాక్ టెయిల్ 2’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హోమి అడజానియా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతి సనన్ సరికొత్త మోడ్రన్ లుక్‌లో కనిపిస్తున్నారు. తన ‘అల్లీ’ క్యారెక్టర్ లుక్స్‌పై ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి కృతి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రెడిట్ అంతా తన వెనుక ఉన్న టీమ్‌దే అంటూ ఇన్‌స్టాలో ఒక స్పెషల్ నోట్ రాసుకొచ్చారు.

హాట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్:

"అల్లీ క్యారెక్టర్ నాకు ఒక విషయం నేర్పింది.. హాట్‌గా ఉండటం, బ్యూటిఫుల్‌గా ఉండటం వేర్వేరు కాదు, రెండు కలిస్తేనే అల్లీ" అంటూ కృతి పేర్కొన్నారు. తను కెరీర్‌లో చేసిన క్యారెక్టర్స్‌లో అల్లీ చాలా ఫ్రీ-స్పిరిటెడ్, ఎవరికీ జడ్జ్ చేయని ఒక క్రేజీ క్యారెక్టర్ అని చెప్పారు. ఆ క్యారెక్టర్‌కు తగ్గట్టే తన ఫ్యాషన్ కూడా ఎంతో కేర్ ఫ్రీగా, బ్యూటిఫుల్ ఛాటిక్‌గా ఉంటుందని కృతి వివరించారు.

స్టైలిష్ట్ అనైతాకు స్పెషల్ థాంక్స్:

ప్రముఖ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అదజానియాకు కృతి సనన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేవలం బట్టలు డిజైన్ చేయడం మాత్రమే కాకుండా, క్యారెక్టర్ పర్సనాలిటీకి తగ్గట్టుగా లుక్స్ ప్లాన్ చేయడంలో అనైతా గ్రేట్ అని పొగిడారు. ఇక ప్రేక్షకులకు తనలో ఒక సరికొత్త యాంగిల్‌ను చూపించినందుకు థాంక్స్ చెప్పారు. అలాగే అసోసియేట్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ హార్డ్ వర్క్‌ను కూడా మెచ్చుకున్నారు.

బీచ్ హెయిర్, సన్‌కిస్డ్ లుక్ అదిరింది:

ఈ సినిమాలో కృతి సనన్ హెయిర్ స్టైల్, మేకప్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఆసిఫ్ అహ్మద్, అడ్రియన్ జాకబ్స్ తనతో ఎన్నో సినిమాలు చేసినా, ఈసారి తనను సరికొత్తగా ప్రెజెంట్ చేశారని కృతి చెప్పారు. ముఖ్యంగా ‘అల్లీ’ బీచ్ హెయిర్ స్టైల్, బ్రాంజ్డ్ సన్‌కిస్డ్ లుక్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోందని, దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని మురిసిపోయారు.

కెప్టెన్ ఆఫ్ ద షిప్ హోమి:

సినిమా డైరెక్టర్ హోమి అడజానియాను ‘మాస్టర్ మైండ్’ అని పిలుస్తూ కృతి ఎమోషనల్ అయ్యారు. అల్లీ క్యారెక్టర్‌ను ఇంత కూల్‌గా డిజైన్ చేసినందుకు, తనను నమ్మినందుకు థాంక్స్ చెప్పారు. నిజానికి హోమి పర్సనాలిటీ నుంచే తాను చాలా విషయాలు అల్లీ క్యారెక్టర్ కోసం తీసుకున్నానని సరదాగా కామెంట్ చేశారు. అలాగే ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రియలిస్టిక్‌గా, బ్యూటిఫుల్‌గా చూపించిన డీఓపీ శాంతాను కూడా మెచ్చుకున్నారు.

"ఆ లొకేషన్లలో నిలబడినప్పుడు ఎంతో గ్రేట్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా, పక్కా అల్లీలా ఫీల్ అయ్యాను" అంటూ కృతి తన పోస్ట్‌ను ముగించారు. జూన్ 19న విడుదల కాబోతున్న ‘కార్టెయిల్ 2’లో కృతి సనన్ నటన, గ్లామర్ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలియాలంటే థియేటర్లలో చూడాల్సిందే. ఇక ఏదేమైనా ఈ సినిమాతో కృతి తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయింది.