కాక్ టైల్ పార్టీలో మస్త్ గా చిల్ చేస్తున్న రష్మిక
బ్లాక్ బస్టర్ మూవీ కాక్ టైల్ సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి సనోన్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్నారు.
By: Sivaji Kontham | 8 April 2026 7:47 PM ISTబ్లాక్ బస్టర్ మూవీ కాక్ టైల్ సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి సనోన్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు రక్తి కట్టిస్తున్నాయి. ఈ మూవీ నుంచి కొత్త పాట `జబ్ తక్..` అంతర్జాలంలో సునామీలా దూసుకుపోతోంది.
ముఖ్యంగా `కాక్ టైల్ 2` సినిమాలో రష్మిక మందన్న పాత్ర అత్యంత కీలకమైనదని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ఈ సినిమాలో రష్మిక ఒక అండర్ కరెంట్ రోల్‌లో కనిపిస్తుందని, కథను మలుపు తిప్పే సందర్భాల్లో ఈ పాత్ర ఎలివేషన్ హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా విడుదలైన `జబ్ తలక్` పాటలో కూడా రష్మిక తన నటన డ్యాన్సులు హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రష్మిక ఇప్పటికే అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఈ సినిమాలో కూడా తనదైన ముద్ర వేయబోతోందని అర్థమవుతోంది.
మరోవైపు కృతి సనన్ తన గ్లామర్‌తో ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొత్తగా విడుదలైన పాటలో కృతి సనన్ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా.. రష్మికను పక్కకు పెట్టినట్టు మాత్రం భావించలేము. రష్మిక పాత్ర స్వభావమే కొంత నిగూఢంగా ఉంటుందని, అందుకే పాటలో తనను ఒక పద్ధతి ప్రకారం చూపించారని తెలుస్తోంది. కృతి ఎంతగా డామినేట్ చేయాలనుకున్నా.. రష్మిక తన పాత్రలో పూర్తిగా లీనమై నటించిందని, తన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాట టీజర్ - ఫస్ట్ లుక్ గమనిస్తే రష్మిక మందన్న చాలా స్టైలిష్‌గా మోడరన్ లుక్‌లో కనిపిస్తోంది. సముద్రపు ఒడ్డున చిత్రీకరించిన ఈ పాటలో రష్మిక రెడ్ కలర్ డ్రెస్సులో చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. షాహిద్ కపూర్- కృతి సనన్‌లతో రష్మిక కెమిస్ట్రీ కూడా చాలా బాగుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. రష్మిక ఈ కాక్ టైల్ టీమ్‌తో చాలా వేగంగా సింక్ అయిపోయిందని టీజర్‌లో తన నవ్వు, కళ్ళలో మెరుపు ఆమె పాత్రలోని జోష్‌ను తెలియజేస్తున్నాయి.
`కాక్ టైల్ 2` విడుదల తేదీ విషయానికి వస్తే ఈ చిత్రం 19 జూన్ 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని ప్రీతమ్ సమకూర్చగా అరిజిత్ సింగ్ ఈ పాటను ఆలపించారు. ఈ భారీ ప్రాజెక్టును అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించారు. వేసవి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
షాహిద్ కపూర్ ఈ సినిమాలో ఒక రొమాంటిక్ బోయ్ లా కనిపిస్తూనే, కొంత కన్ఫ్యూజ్డ్ రోల్‌లో కనిపించబోతున్నారు. ప్రేమ, స్నేహం మధ్య ఏదీ తేలక నలిగిపోయే యువకుడిగా అతడి పాత్ర ఉండనుంది. ఇక సినిమా కథాంశం గురించి చెప్పాలంటే.. ఇది ముగ్గురు వ్యక్తుల మధ్య సాగే ప్రేమ, స్నేహం, వినోదం కలగలిసిన రొమాంటిక్ కామెడీ డ్రామా. మొదటి భాగం లాగానే ఈ సీక్వెల్ కూడా నేటి తరం యువత ఆలోచనలకు అనుగుణంగా ఆకట్టుకునే థీమ్ తో సాగుతుంది. లండన్ సహా విదేశాలలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు.
