Begin typing your search above and press return to search.

రష్మికకు రక్షణగా మారిన కృతి సనన్!

కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా రష్మిక మందన్నను దగ్గరగా చూసేందుకు.. ఆమెతో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు.

By:  Srikanth Kontham   |   14 Jun 2026 12:32 PM IST
రష్మికకు రక్షణగా మారిన కృతి సనన్!
X

సినిమా ప్రమోషన్లు - ఈవెంట్లు ఎంత గ్రాండ్‌గా జరుగుతాయో? కొన్నిసార్లు అంతే స్థాయిలో గందరగోళానికి కూడా దారితీస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ `కాక్‌టెయిల్ 2` ఈవెంట్‌లో ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటనే చోటుచేసుకుంది. ఈ చిత్రంలో నటిస్తున్న స్టార్ హీరో షాహిద్ కపూర్, కృతి సనన్ , సౌత్ సెన్సేషన్ రష్మిక మందన్న ఒకే వేదికపై సందడి చేయడంతో అభిమానుల ఉత్సాహం నభూతో నభవిష్యతి అన్నట్లుగా మారింది. అయితే ఒకానొక దశలో విపరీతమైన అభిమానమే స్టార్ల భద్రతకు సవాలుగా నిలిచింది.

కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా రష్మిక మందన్నను దగ్గరగా చూసేందుకు.. ఆమెతో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ భద్రతా వలయాన్ని దాటుకుని కొందరు ఉత్సాహవంతులైన ఫ్యాన్స్ ముందుకు దూసుకురావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి గందరగోళ వాతావరణం నెలకొంది. ఊహించని ఈ పరిణామంతో రష్మిక అసౌకర్యానికి..కంగారుకు గురైంది. ఈ సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కంటే ముందే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చొరవ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

తోటి నటి ఇబ్బంది పడటం గమనించిన కృతి స‌న‌న్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక రక్షక కవచంలా రష్మికకు అండగా నిలిచింది. ఫ్యాన్స్ రష్మికను తాకకుండా ఆత్మీయమైన అక్కలా తన చేతులతో రష్మికను చుట్టుముట్టి.. జనాల నడుమ నుండి సురక్షితంగా ముందుకు నడిపించింది. ఈ ఆకస్మిక చర్య అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల మధ్య పోటీ, క్యాట్ ఫైట్స్ .. అసూయలు మాత్రమే ఉంటాయనే తప్పుడు అపోహ చాలా కాలంగా ప్రచారంలో ఉంది.

కానీ నేటి తరం నటీమణులు ఆ పాత మూస పద్ధతులను బద్దలు కొడుతూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉమెన్ హుడ్ కు సరికొత్త నిర్వచనం ఇస్తున్నారు. కృతి సనన్ చూపిన ఈ సమయస్ఫూర్తి, తోటి నటి పట్ల ఉన్న కేరింగ్ నేచర్ ఇండస్ట్రీ వర్గాలలోనే కాదు సోషల్ మీడియాలో సైతం ప్రశంసల వర్షం కురిపించేలా చేసింది.ఈ సంఘటన సెలబ్రిటీల పబ్లిక్ ఈవెంట్లలో క్రౌడ్ మేనేజ్‌మెంట్లో పాలను మరోసారి ఎత్తిచూపింది. అభిమానం అనేది హద్దులు దాటినప్పుడు అది స్టార్స్ వ్యక్తిగత భద్రతకు ఎంతటి ముప్పుగా మారుతుందో? ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఎంతటి భారీ భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఇలాంటి ప్రమోషనల్ ఈవెంట్లలో అభిమానులు విచక్షణ మరిచి ప్రవర్తించడం వల్ల అటు మేకర్స్ పై, ఇటు ఈవెంట్ నిర్వాహకులపై భవిష్యత్తు ఈవెంట్ల ప్లానింగ్ విషయంలో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది.

`కాక్‌టెయిల్ 2` సినిమా ప్రమోషన్ల హడావుడి ఎలా ఉన్నా? కృతి, రష్మిక ల మధ్య కనిపించిన ఈ అందమైన బాండింగ్ మాత్రం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇద్దరు అగ్ర నాయికలు స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంత మెచ్యూర్డ్ గా ఉంటారో? ఈ ఘటన నిరూపించింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇద్ద‌రి వీడియోలు .. ఫోటోలు వైరల్ అవుతుండటంతో ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పాజిటివ్ బజ్ మరింతగా పెరిగాయి.