ఫ్యాన్స్‌కి, కార్యకర్తలకు సీఎం విజయ్ వార్నింగ్..!
సోషల్ మీడియా ద్వారా సీఎం విజయ్ పార్టీ అధికారిక ఖాతా ద్వారా నాయకులకు, ఫ్యాన్స్‌కి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు అనడం కంటే వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉందని పలువురు తమిళ మీడియా వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.
By: Ramesh Palla | 12 May 2026 6:27 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేశాడు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విజయ్ ప్రజలకు తన పార్టీ నాయకులకు, తన ఫ్యాన్స్ ఇబ్బందులు కలిగించకూడదు అంటూ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన అభిమానులకు ముందస్తుగానే సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ద్వారా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రజల సంక్షేమం కోసం పార్టీని ప్రారంభించినట్లుగా ప్రకటించిన విజయ్, వారికి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాల వారు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా సీఎం విజయ్ పార్టీ అధికారిక ఖాతా ద్వారా నాయకులకు, ఫ్యాన్స్‌కి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు అనడం కంటే వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉందని పలువురు తమిళ మీడియా వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.
సీఎం విజయ్ పేరుతో...
పార్టీ కార్యకర్తలు, ఫ్యాన్స్ వేడుకల పేరుతో రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయడం, స్టేజ్‌లు ఏర్పాటు చేసి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేయడం వంటివి చేయకూడదు. ప్రజలకు ఏ విధంగానైనా ఇబ్బంది కలిగించే వేడుకలను నిర్వహించకూడదని అందులో పేర్కొన్నారు. అంతే కాకుండా పార్టీ నాయకుడి పేరుతో పెద్ద పెద్ద పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయకూడదని సూచించారు. పార్టీ పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. పుట్టిన రోజు వేడుకలు, ఇతర వేడుకల విషయంలో పార్టీ నాయకత్వం సూచనల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు సాగాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు. విజయ్ ఈ నిర్ణయంను తీసుకోవడంను చాలా మంది అభినందిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వేడుకలను నిర్వహించకూడదని టీవీకే పార్టీ కేడర్ కి ఆదేశాలు ఇవ్వడం మంచి పరిణామం.
జాతీయ స్థాయిలో విజయ్ చర్చ...
పార్టీ ఏర్పాటు చేసిన చాలా తక్కువ సమయంలోనే విజయ్ సీఎం పీఠం దక్కించుకోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. ఆయన్ను ఎన్ని శక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు ఆయనకి మద్దతు నిలిచారు. అందుకే ఆయన సీఎం అయ్యారు. తన వెంట నడిచిన కార్యకర్తలకు, తనను నమ్మిన తమిళ ప్రజల కోసం తనదైన మార్క్ కొత్త పరిపాలన అందించడంతో పాటు, సాంప్రదాయ రాజకీయం పక్కన పెట్టాలని భావించాడు. అందుకే విజయ్ పార్టీ కార్యకర్తలను విజయోత్సవాలు నిర్వహించకూడదని ఆదేశించడంతో పాటు, పార్టీ పేరు చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం వంటివి కూడా చేయకూడదని, ప్రభుత్వ అధికారుల వద్ద పార్టీ నాయకులు తమ పరపతి ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయవద్దని కూడా సొంత పార్టీ కార్యకర్తలకు నాయకులకు విజయ్ సూచించారని తెలుస్తోంది.
తమిళనాడు సీఎం విజయ్..
సినీ నటుడిగా విజయ్ ఎన్నో విజయాలు దక్కించుకున్నాడు. సినిమా ప్రస్థానం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ హీరోగా తొలి హిట్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. విజయ్ కి ఉన్న బ్యాక్ గ్రౌండ్ వల్ల స్టార్‌డం రాలేదు, స్వయంగా కష్టపడి సంపాదించుకున్నాడు. తండ్రి సహకారం ఉన్నప్పటికీ దక్కని సక్సెస్ కోసం కష్టపడి మరీ సంపాదించాడు. దేశ వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు తన వైపు తిరిగి చూసే విధంగా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పలు రికార్డ్‌లను బ్రేక్ చేసి మరీ విజయ్ ను తమిళ ప్రజలు సీఎంను చేశారు. అందుకే వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు. ఆ కృతజ్ఞత భావంతోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు అన్నింటిని అప్పుడే నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. మాజీ సీఎం స్టాలిన్ ను కలవడం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.
