Begin typing your search above and press return to search.

ఓ ఇంటివాడైన నారా రోహిత్.. పెళ్లిలో సీఎం చంద్ర‌బాబు-భువ‌నేశ్వ‌రి దంప‌తులు

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడ‌య్యాడు. తాను వ‌ల‌చిన అందాల క‌థానాయిక శిరీష (సిరి లెల్లా)ను వివాహ‌మాడాడు.

By:  Sivaji Kontham   |   31 Oct 2025 9:38 AM IST
ఓ ఇంటివాడైన నారా రోహిత్.. పెళ్లిలో సీఎం చంద్ర‌బాబు-భువ‌నేశ్వ‌రి దంప‌తులు
X

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడ‌య్యాడు. తాను వ‌ల‌చిన అందాల క‌థానాయిక శిరీష (సిరి లెల్లా)ను వివాహ‌మాడాడు. నేటి నుంచి అత‌డి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొద‌లైంది.




ఈ సాంప్ర‌దాయ వివాహ వేడుక‌లో కుటుంబ స‌భ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు, సినీరాజ‌కీయ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖులు పాల్గొన్నారు. వివాహానికి విచ్చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు- భువ‌నేశ్వ‌రి దంప‌తులు నవ వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. రోహిత్ కుటుంబానికి అసాధార‌ణ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్నా, అత‌డు స్వ‌త‌హాగానే సింప్లిసిటీని, గోప్య‌త‌ను ఇష్ట‌ప‌డ‌తారు. ఈ వివాహాన్ని అత‌డు ఎంతో సింపుల్ గా ఎలాంటి హైప్ హంగామా లేకుండా ప్లాన్ చేసార‌ని అర్థ‌మ‌వుతోంది. రోహిత్ సాంప్ర‌దాయ వైట్ అండ్ వైట్ దుస్తుల్లో క‌నిపించ‌గా, వధువు క్లాసిక్ పట్టు చీరలో మెరిసిపోయారు.




ప్ర‌స్తుతం రోహిత్- శిరీష జంట‌ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు. కొత్త జంట జీవితం ఆనందోత్సాహాల‌తో సాగాల‌ని ఆశీర్వ‌దిస్తున్నారు.

నారా రోహిత్ భార్య శిరీష ప్రతినిధి 2 లో క‌థానాయిక‌గా న‌టించారు. ఇంత‌కుముందు కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం జ‌రిగింది. నారా రోహిత్ కుటుంబ స‌భ్యులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయుడు, ఎంఎల్ఏ కం హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ల స‌మ‌క్షంలో అత‌డు శిరీష వేలికి నిశ్చితార్థపు ఉంగ‌రం తొడిగారు. శిరీష ప‌ల్నాడు అమ్మాయి. రోహిత్ తో కొన్నేళ్లుగా స్నేహంలో ఉన్నారు. ఆస్ట్రేలియాలో కొంత‌కాలం ఉద్యోగం చేసిన శిరీష ఆ త‌ర్వాత న‌ట‌న‌పై అభిరుచితో హైద‌రాబాద్ లోని త‌న సోద‌రి ఇంటికి వ‌చ్చారు. అటుపై న‌ట‌న‌లో అవకాశాల కోసం ప్ర‌య‌త్నించారు. ఆడిష‌న్స్ లో ప్ర‌తినిధి 2కి ఎంపిక‌య్యారు. శిరీష‌కు ముగ్గురు సోద‌రీమ‌ణులు ఉన్నారు.

వృత్తిపరంగా చూస్తే.. నారా రోహిత్ బాణం సినిమాతో క‌థానాయ‌కుడు అయ్యాడు. ఆ త‌ర్వాత ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సోలో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ప్ర‌తినిధి - ప్ర‌తినిధి 2 అత‌డికి మంచి పేరు తెచ్చాయి. `సుందరకాండ` అనే చిత్రంలోను న‌టించారు. పెళ్లి త‌ర్వాతా రోహిత్ న‌టుడిగా కొన‌సాగుతార‌ని స‌మాచారం.