సరికొత్త స్ట్రాటజీ.. ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారుతున్న అధ్యాపకులు..
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
By: Madhu Reddy | 8 Dec 2025 10:48 AM ISTఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ స్టూడెంట్స్ మొదలుకొని కాలేజ్ యువత వరకు అటు ఉద్యోగస్తులు కూడా ఒకవైపు తమ పనుల్లో నిమగ్నమవుతూనే.. మరొకవైపు ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారుతున్నారు. అంతేకాదు ఇంట్లో ఉంటున్న గృహిణిలు.. ఉద్యోగం చేసే అమ్మాయిలు.. ఇలా ఒక్కరేమిటి చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారి తమ అభిరుచిని చాటుకుంటున్నారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో సరికొత్త స్ట్రాటజీ మొదలైంది అని చెప్పాలి. ముఖ్యంగా స్కూల్ టీచర్స్ తో పాటూ కాలేజ్ అధ్యాపకులు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారుతూ.. వేగంగా ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. దీనికి కారణం వారి స్టూడెంట్సే అని చెప్పాలి. ముఖ్యంగా ఒక టీచర్ తమ జీవిత కాలంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానానికి చేర్చగలుగుతారు. అటు టీచర్లకు లేదా అధ్యాపకులకు ఎంతోమంది విద్యార్థులతో మంచి అవినాభావ సంబంధం ఉంటుంది.
అలాంటి ఈ అధ్యాపకులు సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, సమాజంలో జరిగే విషయాలపై స్పందించడం లాంటివి ఎక్కువగా చేస్తున్నారు. పైగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు విద్యార్థులు కూడా అరే ఈయన మా టీచర్.. అరే ఈ మేడం మాకు చదువు చెప్పిన వారే కదా.. అంటూ వారికి ఫాలో కొట్టేస్తున్నారు. అంతేకాదు తమ ఫ్రెండ్స్ కి కూడా ఆ రీల్స్ షేర్ చేస్తూ వారికి ఫాలోవర్స్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అలా అధ్యాపకుల ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారుతూ.. అందరికీ చేరువవుతున్నారు. మరి కొంతమంది రిటైర్మెంట్ తీసుకున్న అధ్యాపకులు కూడా ఇలాగే రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అలాగే సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తూ.. చదువు చెప్పడం వల్ల విద్యార్థులకు.. ఇలా రీల్స్ చేయడం వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుస్తున్నారు.
సాధారణంగా స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేదా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయా స్కూల్ లేదా కాలేజీకి సంబంధించిన అధ్యాపకులకు టచ్ లో ఉండడం చాలా అరుదు. ఇక ఎవరికి వారు ఉన్నత చదువుల కోసం విద్యార్థులు వెళ్లిపోతే.. మళ్ళీ తమ కెరియర్లో తమకు చదువు చెప్పిన గురువులను కలుసుకునే అవకాశం కూడా ఉండదు. కానీ ఇలా సోషల్ మీడియా రీల్స్ ద్వారా మళ్లీ తమ అధ్యాపకులకు అందుబాటులోకి వెళ్లడమే కాకుండా వారిని కలిసే అవకాశం కూడా లభిస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఇలాంటి సోషల్ మీడియాల వల్ల అటు అధ్యాపకులు పాపులారిటీ అందుకోవడమే కాకుండా.. ఇటు విద్యార్థులకు కూడా చేరువవుతున్నారు
పైగా ఈ సోషల్ మీడియా వల్ల వారి ఇన్కమ్ కూడా పెరుగుతోందనే వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం అధ్యాపకులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారుతూ ఉండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
