మెథడ్ యాక్టింగ్, క్లాసికల్ యాక్టింగ్ అంటే ఏంటి? మన హీరోలు చేసేది ఏంటి?
ఒక నటుడు తను నటించబోయే పాత్ర యొక్క పరిమితులు ఏంటో తెలుసుకొని ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, శరీర ఆకృతిలో ఎలాంటి మార్పులు చూపించాలి.
By: Gopi Velupala | 2 Oct 2026 2:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో నటులకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఒక క్యారెక్టర్ లో ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేసి ఆడియన్స్ ను ఆ పాత్రతో పాటు చివరి వరకు నడిపించడం అనేది అంత ఆషా మాషీ వ్యవహారమైతే కాదు. అలాంటిది నటులు వాళ్ళు చేసే క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలవోక గా తమ వైపు తిప్పుకోగలుగుతారు. ఎవరు ఎంత గొప్పగా నటిస్తే వాళ్లకు అంత ఎక్కువ ఫ్యూచర్ ఉంటుందనేది వాస్తవం... ఇక నటన గురించి ప్రస్తావన వచ్చిన ప్రతి సారి 'క్లాసికల్ యాక్టింగ్', 'మెథడ్ యాక్టింగ్' అనే మాటలను మనం వింటూనే ఉంటాం. నిజానికి క్లాసికల్ యాక్టింగ్ అంటే ఏంటి? మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...
క్లాసికల్ యాక్టింగ్
ఒక నటుడు తను నటించబోయే పాత్ర యొక్క పరిమితులు ఏంటో తెలుసుకొని ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, శరీర ఆకృతిలో ఎలాంటి మార్పులు చూపించాలి. ఎలా నడవాలి ఎలా చూడాలి, ఎంత నవ్వాలి ఎప్పుడూ ఏడవాలి, డైలాగ్ చెప్పేటప్పుడు డిక్షన్ ఎలా ఉండాలి. అనే విషయాల్లో చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. రెగ్యూలర్ యాక్టర్స్ లా కాకుండా తనకంటూ ఒక ఓన్ స్టైల్ ను క్రియేట్ చేసుకొని డైలాగ్ మొత్తాన్ని సింగిల్ టేక్ లో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా క్లాసికల్ యాక్టర్స్ ను మనం నాటకాలలో ఎక్కువగా చూస్తుంటాం... నాటక రంగం నుంచి వచ్చిన చాలా మంది ఆర్టిస్టులు క్లాసికల్ యాక్టర్స్ గానే గుర్తింపబడతారు. ఎలాంటి డైలాగ్స్ అయినా సరే చాలా ఈజీగా కన్వే చేయగలిగే కెపాసిటి వాళ్లకు ఉంటుంది... మొత్తానికైతే వీళ్లు యాక్టింగ్ ని చాలా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ల యాక్టింగ్ చూస్తున్నంత సేపు ఎక్కడ కూడా మనకు ఎమోషన్ మధ్యలోనే కట్ అయిందనే ఫీల్ రాదు. ఒక ప్రాపర్ ఎమోషన్ ను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి ప్రేక్షకులను భావోద్వేగానికి గురయ్యేలా చేస్తుంటారు. అలాంటి నటనని క్లాసికల్ యాక్టింగ్ అంటాం...
మెథడ్ యాక్టింగ్
'మెథడ్ యాక్టింగ్' అంటే డైరెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ గురించి వివరించిన వెంటనే ఆ నటుడు ఆ క్యారెక్టర్ ను తన నిజ జీవితానికి కనెక్ట్ చేసుకుంటాడు. ప్రస్తుతం ఆ ప్రాబ్లం తమకి వస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఇమాజిన్ చేసుకొని నటించే ప్రయత్నం చేస్తారు. దీనినే మెథడ్ యాక్టింగ్ అంటారు. దీనివల్ల నటనలో సహజత్వం కనిపిస్తుంది. ప్రేక్షకుడు ఆ నటుడి యాక్టింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. వాళ్ళు ఏ పాత్ర చేస్తే అందులో లీనమైపోయి ప్రపంచంతో సంబంధం లేకుండా అది పూర్తయ్యేంత వరకు ఆ పాత్ర లోనే ఉంటారు. మొత్తానికి మెథడ్ యాక్టింగ్ ను ఇంప్లిమెంట్ చేసే కొంతమంది నటులు చాలా న్యాచురల్ గా నటించారు అసలు ఎక్కడ కూడా యాక్టింగ్ చేసినట్టుగా అనిపించలేదు అంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంశలను అందుకుంటుంటారు...
ప్రేక్షకులు స్క్రీన్ మీద చూసేదంతా అబద్ధం అని తెలిసినా కూడా ఒక నటుడు ప్రేక్షకుడి చేత కన్నీళ్లు పెట్టించగలుగుతున్నాడు అంటే నటనకి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... ఇక ఇండస్ట్రీలో ఒక్కొక్క నటుడు తన క్యారెక్టర్ ని బట్టి అందులో పరకాయ ప్రవేశం చేసి నటించి మెప్పిస్తున్నారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్న కొంత మంది ఆర్టిస్టులు గొప్ప నటులుగా తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్న వాళ్లే కావడం విశేషం...
