Begin typing your search above and press return to search.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ప్రియాంక చోప్రా సిటాడెల్ సీజన్ 2.. ట్రైలర్ రిలీజ్!

ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కలయికలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

By:  Madhu Reddy   |   22 April 2026 1:01 PM IST
ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ప్రియాంక చోప్రా సిటాడెల్ సీజన్ 2.. ట్రైలర్ రిలీజ్!
X

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లలో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూ దూసుకుపోతోంది.. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసిలో మందాకిని అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం గట్టిగానే కష్టపడుతోంది. ఇక మరొకవైపు 2023 ఏప్రిల్ లో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని అమెజాన్ ప్రైమ్ లో టాప్ లో నిలిచిన ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ తో అందరి హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు ఈ రెండవ సీజన్ కూడా స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది.

ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కలయికలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు తెరదించుతూ అమెజాన్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. మే 6వ తేదీ నుండి ఈ వెబ్ సిరీస్ ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా ట్రైలర్ ని కూడా విడుదల చేసింది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు స్పష్టం చేసింది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా ఈ భాషలలో అందుబాటులోకి రావడం గమనార్హం.

సిటాడెల్ సీజన్ 2 వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. రెండవ సీజన్లో ప్రపంచాన్ని ప్రమాదం నుండి కాపాడడానికి మేసన్ కేన్ మళ్లీ తన పాత గూడచారి రూపంలోకి మారాల్సి వచ్చినప్పుడు మాజీ ఏజెంట్లు నదియా సిన్హ్ (ప్రియాంక చోప్రా), మేసన్ కేన్(రిచర్డ్ మ్యాడెన్) మళ్లీ ఏకమై మాంటికోర్ అనే విద్రోహ సంస్థతో పోరాడనున్నారు. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్లో ఊహించని భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నట్లు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చేశారు. మానవాళిని రక్షించడానికి అటు ప్రియాంక ఇటు రీఛార్జ్ చేసే సాహసాలు ఈ సీజన్లో హైలెట్ కానున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

సిటాడెల్ సీజన్ వన్ విషయానికి వస్తే.. భారీ గ్లోబల్ స్పై యాక్షన్ సిరీస్ గా రూపుదిద్దుకున్న ఈ సిరీస్ ని రుస్సో బ్రదర్స్ నిర్మించారు. ఇందులో ప్రియాంక చోప్రా, రిచర్డ్ ప్రధాన పాత్రలు పోషించగా మాంటికోర్ అనే దుష్ట సంస్థ చేతిలో సిటాడెల్ ఏజెన్సీ నాశనమైన తర్వాత.. జ్ఞాపకాలు కోల్పోయిన ఇద్దరు ఏజెంట్లు తమ గతాన్ని తెలుసుకొని ప్రపంచాన్ని రక్షించడానికి తిరిగి ఎలా కలిశారు అనేదే కథ.. ఇప్పుడు ఆ ఇద్దరు కలిసిన తర్వాత ప్రపంచాన్ని ఎలా రక్షించారు? అనే కథాంశాన్ని సీజన్ 2 లో చూపించనున్నారు . ఏప్రిల్ 28 2023న మొదటి రెండు ఎపిసోడ్లు విడుదల అవ్వగా.. ఆ తర్వాత నాలుగు ఎపిసోడ్లను రిలీజ్ చేశారు. అలా మొత్తం 6 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు మరో కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.