రియలిస్టిక్ అప్రోచ్ తో నోలన్ సంచలనం!
ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ మరోసారి 'ది ఒడిస్సీ' తో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 23 July 2026 1:30 PM ISTప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ మరోసారి 'ది ఒడిస్సీ' తో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న సంగతి తెలిసిందే. సినినమాలో ప్రతీ ప్రేమ్ ను ఎంతో అందంగా.. అద్భుతంగా చెక్కారు. టెక్నికల్ గానూ సినిమా ఎంతో అప్ డేట్ గా హైలైట్ అయింది. అయితే ఈ సినిమా కోసం నోలన్ కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద ఆధారపడకుండా ప్రాకృతిక వాతావరణంలోనే సహజ సిద్ధమైన ఎఫెక్ట్స్‌ను సృష్టించడం ప్రత్యేకతగా నిలిచింది. 10 అడుగులు భారీ కాయులను చూపించేందుకు డిజిటల్ టెక్నాలజీని పక్కన పెట్టి సరికొత్త ప్రాక్టికల్ పద్ధతులను అవలంబించడం తాజాగా పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
ఈ చిత్రంలో పది అడుగుల ఎత్తుండే భారీ మానవుల పాత్రలను సృష్టించడానికి నోలాన్ ఎలాంటి డిజిటల్ మాయాజాలాన్ని ఉపయోగించలేదు. దీనికోసం ప్రత్యేకమైన నిష్పత్తులు కలిగిన భౌతిక నమూనాలు, కెమెరా యాంగిల్స్ , వినూత్న పద్ధతులను రంగంలోకి దించారు. విజువల్ ఎఫెక్ట్స్ గ్రీన్ స్క్రీన్‌ల కంటే రియల్ సెట్స్‌లో నటించడం వల్ల నటులకు సహజమైన హావభావాలు పండించడానికి అవకాశం ఉంటుందని బలంగా నమ్మారు. ఈ తరహా రియలిస్టిక్ అప్రోచ్ సినిమా అనుభూతిని నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సినిమాలో హాలీవుడ్ నటుడు మ్యాట్ డ్యామన్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చిత్రంలోని కొన్ని కఠినమైన, ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన స్థానంలో ఒక మహిళా స్టంట్ డబుల్‌ను ఉపయోగించడం మరో విశేషం. జెండర్ బ్యారియర్స్‌ను దాటి ప్రతిభే ప్రామాణికంగా నిపుణులను ఎంపిక చేయడం లో నోలాన్ ఎప్పుడూ ముందుంటారనేది మరోసారి రుజువైంది. ఆ స్టంట్ డబుల్ చూపిన తెగువ .. నైపుణ్యం సినిమాలోని కీలక సన్నివేశాలకు ప్రాణం పోసాయి.
ప్రస్తుతం సీజీఐ వాడకం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో నోలాన్ అనుసరిస్తున్న రిట్రో-మోడరన్ అప్రోచ్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. డిజిటల్ గ్రాఫిక్స్ ఎంతగా అభివృద్ధి చెందినా? కెమెరా ముందు జరిగే అసలైన మేజిక్ వేరుగా ఉంటుందని నిరూపిస్తున్నారు. ఈ విధానం వల్ల నిర్మాణ వ్యయం, సమయంతో పాటు నటుల నటనలో కనిపించే సహజత్వం ప్రేక్షకులను మరింతగా కట్టిపడేస్తాయి. హాలీవుడ్ స్టూడియోల ధోరణికి భిన్నంగా ఆయన నడిచే బాట ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించేటప్పుడు సవాళ్లు సాధారణమే అయినా? నోలాన్ బృందం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ప్రేక్షకులకు అద్భుత దృశ్య కావ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ రూపుది ద్దుకుందని రిలీజ్ తర్వాత ప్రేక్షకులు నిర్దారించారు. టెక్నాలజీని గుడ్డిగా నమ్ముకోకుండా? మానవ మేధస్సుకు, సృజనాత్మకతకు పెద్దపీట వేయడం వల్ల వచ్చే ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఈ చిత్రం మరోసారి నిరూపించింది.
