Begin typing your search above and press return to search.

క్రిస్టోఫర్ నోలన్ స్టోరీ లోని సోల్ చెడిపోకుండా స్క్రీన్ ప్లే ఎలా రాస్తాడు.?

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ స్క్రీన్ ప్లే రాయడంలో సిద్ధహస్తుడు. చాలా మంది డైరెక్టర్స్ ఆయన సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్క్రీన్ ప్లే రాసుకుంటారు.

By:  Gopi Velupala   |   13 Oct 2026 10:40 AM IST
క్రిస్టోఫర్ నోలన్ స్టోరీ లోని సోల్ చెడిపోకుండా స్క్రీన్ ప్లే ఎలా రాస్తాడు.?
X

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ స్క్రీన్ ప్లే రాయడంలో సిద్ధహస్తుడు. చాలా మంది డైరెక్టర్స్ ఆయన సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్క్రీన్ ప్లే రాసుకుంటారు. ఆయన చేసిన ది ప్రెస్టేజ్, మెమంటో, ఇన్సెప్షన్, టెనెట్ లాంటి సినిమాలు ఆయనలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాయి. ప్రతి సినిమాలో ఆయన ఎఫర్ట్ కనిపిస్తుంది.

స్క్రీన్ ప్లే రాయడంలో స్పెషలిస్ట్

ఒక కథను రెగ్యూలర్ పద్ధతిలో చెప్పడం ఆయనకి అలవాటు లేదు. 'నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే' లో మూవీని స్టార్ట్ చేసినప్పటికి అందులో కొన్ని లేయర్స్ ను పెట్టుకొని రాస్తూ ఉంటాడు... ఉదాహరణకి మెమెంటో మూవీలో కథ గతం వైపు తీసుకెళ్తుంది. హీరో భార్య చావుకి కారణం ఎవరు అనేది తెలుసుకునే క్రమంలోనే కథను వెనక్కి తీసుకెళ్తాడు.

ఇన్సెప్షన్

ఇందులో కలల గురించి చాలా లోతు గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక కల లోపల మరొక కల అందులో ఈ ఇంకో కల ఇలా కొన్ని లేయర్స్ గా జరుగుతుంది. మొదటి సారి మూవీ చేసే ఆడియన్స్ కి ఏది కల ఏది నిజం అనే తేడా తెలియదు. అందుకే ఆయన ప్రతి సినిమాను రిపిటెడ్ గా చూసినప్పుడే అర్థమవుతాయి... ఈ విషయంలో నోలన్ సైతం నా మూవీస్ ఒక్కసారి చూస్తే అర్థం కావు. వాటిని జనాలు మళ్ళీ మళ్లీ చూడటానికి ప్రేరేపించేలా స్క్రీన్ ప్లే రాసుకుంటానని ఆయన చాలా క్లారిటీ గా చెప్పాడు...

కథలోని సోల్ చెడిపోకూడదు...

కొంతమంది దర్శకులు ప్రేక్షకులకు థ్రిల్ ఫీల్ ఇవ్వడానికి ఇష్టం వచ్చినట్టుగా ట్విస్ట్ లను రాస్తారు. దీనివల్ల స్టోరీ లోని సోల్ చచ్చిపోతుంది. స్టోరీ కి తగ్గ స్క్రీన్ ప్లే రాయాలంటే కసరత్తులు చేయాలి. కథలోని కోర్ ఎమోషన్ ఏంటో తెలుసుకొని దానికి బౌండరీస్ గీసుకొని సోల్ చెడిపోకుండా స్క్రీన్ ప్లే ను రాయాలి. ఒకసారంగా ఇలా రాయడం ప్రయోగమనే చెప్పాలి. దానిని కొందరు మాత్రమే సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేస్తారు. అందులో నోలన్ మొదటి స్థానంలో ఉంటాడు.

ఉదాహరణకి నోలన్ మూవీస్ లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ను వాడినప్పటికి కోర్ ఎమోషన్ ను మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకుంటాడు. 'ఇన్సెప్షన్' లాంటి మైండ్ బెండింగ్ సినిమాలో కూడా పిల్లల దగ్గరికి వెళ్లాలనే తండ్రి తాపత్రయం కనిపిస్తుంది. అలాగే 'ఇంటర్ స్టెల్లర్' సినిమాలో ప్రపంచాలు దాటిపోయే సైన్స్ ను చూపించినప్పటికి తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే ఆ ఎమోషన్ బాండింగ్ ను చాలా పవర్ ఫుల్ గా బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేశాడు.

ఇప్పుడున్న దర్శకులలో నోలన్ లాంటి స్క్రీన్ ప్లే రాసే దర్శకుడు మరొకరు ఉండరు. అందుకే ఆయన ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. వాటిని చూడటానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తుంటారు... తన మూవీస్ ఇన్స్పిరేషన్ తో తెలుగులో కూడా కొంతమంది డిఫరెంట్ స్క్రీన్ ప్లే రాయడానికి ట్రై చేశారు. అందులో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఫ్లాప్ అయ్యారు. ఇక రీసెంట్ గా వచ్చిన 'ది ఒడిస్సీ' మూవీ ఇండియన్ ప్రేక్షకులను, ముఖ్యంగా తెలుగు వాళ్ళను విపరీతంగా అలరించింది. తన సినిమాలో గ్రాఫిక్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడు. నేచురల్ లోకేషన్స్ లో షూట్ చేస్తూ ప్రేక్షకుడికి రియలెస్టిక్ ఫీల్ కలిగించడంలో సక్సెస్ అవుతున్నాడు...