Begin typing your search above and press return to search.

ఖైదీ, విక్ర‌మ్ లాంటి క్రిమిన‌ల్స్ తో చియాన్!

చియాన్ విక్ర‌మ్ కి సరైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. `తంగ‌లాన్` తో మంచి అటెంప్ట్ చేసినా? అంచ‌నాలు అందుకోలేదు. అటుపై రిలీజ్ అయిన `వీర ధూర శూర` విక్ర‌మ్ రేంజ్ హిట్ కాదు.

By:  Srikanth Kontham   |   29 Sept 2025 3:00 PM IST
ఖైదీ, విక్ర‌మ్ లాంటి క్రిమిన‌ల్స్ తో చియాన్!
X

చియాన్ విక్ర‌మ్ కి సరైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. `తంగ‌లాన్` తో మంచి అటెంప్ట్ చేసినా? అంచ‌నాలు అందుకోలేదు. అటుపై రిలీజ్ అయిన `వీర ధూర శూర` విక్ర‌మ్ రేంజ్ హిట్ కాదు. దీంతో విక్ర‌మ్ లో స‌క్సెస్ అనే నిరాశ అలాగే నిండి ఉంది. లైన‌ప్ చూస్తే మాత్రం స్ట్రాంగ్ గా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం మ‌డోన్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రేమ్ కుమార్ తోనూ ఓ క‌మిట్ మెంట్ ఉంది. అశ్విన్ -చిత్రం అనంత‌రం ఇది ప‌ట్టాలె క్కుతుంది. మ‌డోన్ అశ్విన్ తో చేస్తోన్న చిత్రం యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కాగా, ప్రేమ్ కుమార్ తో చేసేది క్లాసిక్ స్టోరీగా తెలుస్తోంది.

అయితే వీళ్లిద్ద‌రు క్యూలో ఉండ‌గానే విక్ర‌మ్ కోలీవుడ్ సంచ‌ల‌నం లోకేష్ క‌న‌గ‌రాజ్ శిష్యుడిని బ‌రిలోకి దించుతున్నాడు. `ఖైదీ`, `విక్ర‌మ్` లాంటి సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసిన విష్ణు ఎడ‌వ‌న్ అనే కుర్రాడితో సినిమా చేసేందుకు విక్ర‌మ్ డీల్ కుదుర్చుకున్నాడు. విష్ణు లోకేష్ తో పాటు ప‌లువురు ద‌ర్శ‌కుల వ‌ద్ద వివిధ శాఖ‌ల్లో ప‌ని చేసాడు. చివ‌రిగా లోకేష్ వ‌ద్ద మ‌రింత రాటు దేలాడు. ఈ నేప‌థ్యంలో విష్ణు ప‌నిత‌నం చూసిన చియాన్ అత‌డిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసే బాధ్య‌త తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ నిర్మించ‌డానికి ముందుకొచ్చింది. అనిరుద్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా లాక్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మ‌రి విష్ణు ఎడ‌వ‌న్ ఎలాంటి స్టోరీతో విక్ర‌మ్ ని లాక్ చేసాడు? అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం సినిమా ట్రెండ్ మారింది. అందుకు త‌గ్గ‌ట్టే న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు అప్ డేట్ అవుతున్నారు. కొత్త‌గా వ‌చ్చే ద‌ర్శ‌కుల‌తో ఆ ర‌క‌మైన ఇబ్బ‌ది లేదు. రావ‌డ‌మే అప్ డెటెడ్ వెర్ష‌న్ తో రెడీగా ఉంటున్నారు. దీంతో హీరోల‌కు కూడా వాళ్ల‌తో ఎలాంటి ఇబ్బందులు రావ‌డం లేదు.

ట్రెండ్ కి త‌గ్గ కాన్సెప్ట్ ల‌ను ఎంచుకుని హీరోల్ని లాక్ చేస్తున్నారు. విక్ర‌మ్ కూడా అలా లాక్ అయిన హీరోనే.

అయితే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ లైన్ లో ఉన్న చిత్రాల‌న్నింటిని పూర్తి చేయాలి. అవి పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి ఎలా లేద‌న్నా ఏడాది స‌మ‌యం ప‌డుతుంది. ఆ త‌ర్వాతే లోకేష్ శిష్యుడు ప్రాజెక్ట్ పై విక్ర‌మ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.