తండ్రి కాదు, తమ్ముడిలా విక్రమ్...!
విక్రమ్ ఆమధ్య వరుస ఫెయిల్యూర్స్ కారణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిమితం అవుతాడు అని అంతా అనుకున్నారు.
By: Ramesh Palla | 25 April 2026 8:00 PM ISTతమిళ సినిమా ఇండస్ట్రీలో యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తర్వాత విభిన్నమైన గెటప్స్‌లో కనిపించిన స్టార్ చియాన్ విక్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న గుర్తింపు, ఆయన స్టార్‌డం ఈ మధ్య కాలంలో కాస్త తగ్గుతుంది అనే కామెంట్స్ వినిపించిన ప్రతిసారి తనదైన మార్క్‌ను ఇండస్ట్రీలో చూపించేందుకు కష్టపడుతూనే ఉంటాడు. విక్రమ్ ఇటీవలే ఆరు పదుల వయసులో అడుగు పెట్టాడు. ఇప్పటికే విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. సాధారణంగా ఇండస్ట్రీలు ఆరు పదుల వయసుకు చేరిన తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కాస్త మార్పు కనిపిస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ మాత్రం ఏమాత్రం తేడా లేకుండా మునుపటి కంటే మరింత జోష్ తో సినిమాలను ఎంపిక చేస్తున్నాడంటూ ఇటీవల ఒక తమిళ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొనడం విశేషం.
విక్రమ్ హీరోగా వరుస సినిమాలు...
విక్రమ్ ఆమధ్య వరుస ఫెయిల్యూర్స్ కారణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిమితం అవుతాడు అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా విక్రమ్ తిరిగి పుంజుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా రెండు ప్రాజెక్ట్‌లు చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు విక్రమ్ తన సినిమాలోని పాత్రలకు అనుగుణంగా ఈజీగా మారి పోతూ ఉంటాడు. ఎంత ఓల్డ్ గెలప్ అయినా, టీనేజర్ లుక్ లో అయినా ఈజీగా ఒదిగి పోతూ ఉంటాడు అని ఆయన అభిమానులు అనుకుంటూ ఉంటారు. విక్రమ్ కొత్త లుక్‌తో అభిమానులతో పాటు అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఆరు పదుల వయసులో పడ్డ విక్రమ్ తాజా ఫోటోలో చూస్తే కేవలం నాలుగు పదుల వయసు వ్యక్తిలా కనిపిస్తున్నాడు అంటూ నెట్టింట ఈ ఫోటోలను షేర్ చేసి తెగ హడావిడి చేస్తున్నారు. అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యి లుక్ గురించి చర్చ మొదలైంది.
కోలీవుడ్‌లో విక్రమ్, ధృవ్ హీరోలుగా...
కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లోని అన్ని భాషల్లోనూ విక్రమ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన సినిమాలు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే ఆయన కష్టపడి తన ప్రతి సినిమా కోసం లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే విక్రమ్ తన కొత్త సినిమా కోసం ఇలా లుక్ మార్చి ఉంటాడని పలువురు అంటున్నారు. ఇదే సమయంలో విక్రమ్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు మొదలు పెట్టారు. ఇటీవల విక్రమ్ విదేశాలకు వెళ్లి ఇలా అందం పెరిగేందుకు గాను కొన్ని శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే విక్రమ్ లుక్ వైరల్ అవుతుంటే కొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.
న్యూ లుక్‌తో కొత్త సినిమా మొదలు...
ఒక వైపు విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ధృవ్ సినిమాలు చేస్తున్న ఈ సమయంలో ఎందుకు విక్రమ్ హీరోగా ఇంకా ఎక్కువ కష్టపడాలి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. హీరోగా విక్రమ్ పది సినిమాలు చేస్తే అందులో రెండు మూడు హిట్స్ కూడా ఉండటం లేదు అనేది వారి ఆరోపణ. అందుకే విక్రమ్ ఇలా యంగ్ లుక్ లో కనిపించడం మానేసి తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తే బాగుంటుంది అనేది కొందరి సలహా. ఈ లుక్ లో ధృవ్ కి తండ్రిగా కాకుండా తమ్ముడిలా ఉన్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, కొందరు ధృవ్, విక్రమ్ అన్నాదమ్ములు అంటే ఈజీగా నమ్మేస్తారు అంటూ ఈ ఫోటోలను షేర్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. విక్రమ్ రెగ్యులర్ వర్కౌట్స్, డైట్ వల్ల ఈ రేంజ్ లో ఫిట్‌గా ఉన్నాడు. ఈ వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉన్నాడంటే విక్రమ్ ఎంతగా కష్టపడుతాడో అర్థం చేసుకోవచ్చు. విక్రమ్ ను ఈ న్యూ లుక్‌తో సినిమాల్లో చూడాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
