నటికి వ్రాంగ్ డైరెక్షన్ ఇచ్చిన షాడో!
బాలీవుడ్ లో చిత్రాంగద సింగ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం, ప్రతిభ ఉన్నా? అమ్మడు స్టార్ లీగ్ లో చేరడంలో విఫలమైంది.
By: Srikanth Kontham | 23 Dec 2025 5:00 PM ISTబాలీవుడ్ లో చిత్రాంగద సింగ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం, ప్రతిభ ఉన్నా? అమ్మడు స్టార్ లీగ్ లో చేరడంలో విఫలమైంది. నటిగా, నర్తకిగా గుర్తింపు అయితే సంపాదించింది కానీ ఆ క్రేజ్ తో మాత్రం స్టార్ లీగ్ లో చేరలేపోయింది. అందుకు కారణం వైఫల్యాలే. తానెంత కష్టపడినా అమ్మడిని వైఫల్యాలు వెనక్కి నెట్టాయి. కొత్త భామల ఎంట్రీతో పోటీ ని ఎదుర్కోవడంలోనూ విఫలమైంది. చిత్ర పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం ఆమె సొంతం. కానీ సాధించింది ఏంటి? అంటే కనిపించచేది చాలా తక్కువ. అయితే నటిగా వైఫల్యం చెందడానికి కారణం మాత్రం తాను ఒక్కరే కాదంటోంది.
తనని వ్రాంగ్ డైరెక్షన్ లో నడిపించిన వ్యక్తులు కూడా అందుకు కారకులుగా చెప్పుకొచ్చింది. నిజంగా చిత్రాంగదా ఆ చిత్రాలను మిస్ చేసుకోకుండా ఉండి ఉంటే? తాను గొప్ప నటిగా నీరాజనాలు అందుకునేది. హాలీవుడ్ లో సైతం సత్తా చాటేదేమో అనిపిస్తుంది. అవును చిత్రాంగదా వదిలేసుకున్న అవకాశాలు చూస్తే అలాగే ఉంది.`గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్` చిత్రంలో నటించే ఛాన్స్ ముందుగా తనకే వచ్చింది. కానీ నో చెప్పింది. `తను వెడ్స్ మను` కథ కూడా ముందుగా చిత్రాంగద వద్దకే వచ్చింది. కానీ నచ్చకపోవడంతో చేయలేదు.
అందులో కంగనా రనౌత్ నటించి ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. కంగన కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ చిత్రంగా మిగిలిపోయింది. షారుక్ ఖాన్ తో జంటగా `చల్తే చల్తే `సినిమాలో నటించే ఛాన్స్ కూడా చిత్రకే వచ్చింది. కానీ ఆ కథకి కూడా నో చెప్పింది. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించిందే. మరి వీటన్నింటికి ఏ కారణంగా చిత్రాంగదా నో చెప్పింది అంటే? కొన్నింటి విషయంలో స్వయంకృప రాధమైతే ఇంకొన్ని సినిమాల విషయంలో ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి రిజెక్ట్ చేసినట్లు గుర్తు చేసుకుంది. కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదేనని పశ్చాతాప్ప పడుతుంది.
ఇప్పుడెంత బాధపడినా ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయినప్పుడు. అలాగే పరిశ్రమ గురించి కూడా ఓ సైటైర్ వేసింది. ఇండస్ట్రీకి జ్ఞాపక శక్తి చాలా తక్కువ అని..కొన్ని రోజులు కనిపించకపోతే పరిశ్రమ ఎలాంటి వారినైనా మర్చిపోతుం దన్నారు. ఈ మాట మాత్రం నిజమే. ఇండస్ట్రీలో రాణించాలంటే రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. పని ఉన్నా? లేకపోయినా బయట తిరగాలి. పాత పరిచయాల్ని గ్రిప్లో పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ చేసినప్పుడే ఇండస్ట్రీలో ఏదో రోజు కనీసం కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చిత్రాంగదా సింగ్ `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్` లో నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.
