Begin typing your search above and press return to search.

20 ఏళ్ల అనుభ‌వంతో ఎంతో హుందాగా!

'చిత్రాంగ‌దా సింగ్ 'బాలీవుడ్ లో రెండు ద‌శాబ్దాలగా న‌టిగా కొన‌సాగుతుంది. కొంత మంది స్టార్స్ తో క‌లిసి ప‌ని చేసింది.

By:  Srikanth Kontham   |   15 Sept 2025 6:00 PM IST
20 ఏళ్ల అనుభ‌వంతో ఎంతో హుందాగా!
X

'చిత్రాంగ‌దా సింగ్ 'బాలీవుడ్ లో రెండు ద‌శాబ్దాలగా న‌టిగా కొన‌సాగుతుంది. కొంత మంది స్టార్స్ తో క‌లిసి ప‌ని చేసింది. కానీ అమ్మ‌డి ట్యాలెంట్ కి త‌గ్గ గుర్తింపు ఇంకా ద‌క్క‌లేదు. కానీ వ‌చ్చిన అవ‌కాశాలు మాత్రం కాద‌న‌కుండా ప‌ని చేస్తుంది. అందుకే సొగస‌రి పేరు ఇంకా ఇండ‌స్ట్రీలో వినిపిస్తుంది. సోష‌ల్ మీడియాలో సైతం అంతే యాక్టివ్ గా ఉండ‌టంతో? యువ‌త అటెన్ష‌న్ డ్రా చేయ‌గ‌లుగుతుంది. అలాంటి న‌టికిప్పుడు బిగ్ ఆఫ‌ర్ వ‌రించింది. ఏకంగా స‌ల్మాన్ ఖాన్ కి జోడీగా న‌టించే ఛాన్స్ అందుకుంది.

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయకుడిగా అపూర్వ లాఖియా 'బ్యాటిల్ ఆఫ్ గాల్వానా' చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల పాటు ఈ క‌థ‌పైనే ప‌నిచేసి ప‌క్కాగా ప‌ట్టాలెక్కించిన చిత్ర‌మిది. సినిమా ఆన్ సెట్స్ లో ఉన్నా? ఇంత వ‌ర‌కూ హీరోయిన్ ఫైన‌ల్ అవ్వ‌లేదు. కొంత మంది భామ‌ల పేర్లు ప‌రిశీలించిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో? ఇప్పుడా పాత్ర‌కు చిత్రాంగ‌దా సింగ్ ని ఎంపిక చేసారు. ఈ నేప‌థ్యంలో అవ‌కాశం ప‌ట్ల చిత్రాగందా సింగ్ వినూత్నంగా స్పందించింది.

సాధార‌ణంగా స్టార్ తో అవ‌కాశం వ‌చ్చిందంటే? నాయిక‌లు హ‌డావుడి వేరే లెవల్లో ఉంటుంది. త‌న గురించి ఎంతో గొప్ప‌గా చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. కానీ చిత్రాంగదా సింగ్ మాత్రం 20 ఏళ్ల అనుభ‌వం గ‌ల నాయిక అయినా ఆ సీనియార్టీని ఎక్క‌డా ప్ర‌ద‌ర్శించ‌లేదు. ఎంతో డౌన్ టూ ఎర్త్ మాట్లాడింది. స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న అవ‌కాశం రాగానే భ‌య‌ప‌డిన‌ట్లు తెలిపింది. త‌న‌కు స‌ల్మాన్ తో అవ‌కాశం రావడం ఏంట‌ని కొంత సేపు న‌మ్మ‌లేదంది. రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణంలో ఎప్పుడూ రాని అవ‌కాశం త‌న‌కు రావ‌డం ఏంట ని షాక్ అయిన‌ట్లు తెలిపింది.

స‌ల్మాన్ ఖాన్ చాలా పెద్ద స్టార్. ఎంతో మంది అభిమానులున్న న‌టుడు. ఆయ‌న‌తో సినిమా అంటే ఎన్నో అంచ‌నాలుంటాయి. ఆయ‌న విజ‌యం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి స‌మ‌యంలో త‌న‌ని హీరోయిన్ గా తీసుకోవ‌డం కొత్తగా అనిపిస్తుంద‌ని చిత్రాంగ‌దా సింగ్ అభిప్రాయ ప‌డింది. అయితే చిత్రాంగ‌దా ఇలా స్పందించడంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె ఎంతో డౌన్ టూ ఎర్త్ అంటూ నెటి జ‌నులు పోస్టులు పెడుతున్నారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి రెండు..మూడేళ్లు అయితేనే హీరోయిన్లు యాటి యాటి ట్యూడ్ చూపిస్తారని..కానీ చిత్రాంగ‌దా కు మాత్రం ఆ ప‌ద‌మే తెలియ‌న‌ట్లుంద‌ని ఓ యూజర్ పోస్ట్ సాడు.