దసరాకి చిరు, బాలయ్య.. ప్లాన్ సెట్..!
అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ కాగా.. మరొకటి నట సింహం బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్.
By: Ramesh Boddu | 13 Sept 2025 1:00 PM ISTదసరా వస్తుంది అంటే సినిమాల పండగ అన్నట్టే. ఐతే రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ కూడా ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహం ఇస్తుంది. దసరా రోజు రెండు క్రేజీ కాంబినేషన్ సినిమాలు ప్రకటన వస్తుందని తెలుస్తుంది. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ కాగా.. మరొకటి నట సింహం బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్. ఆల్రెడీ రెండేళ్ల క్రితం ఈ రెండు కాంబినేషన్స్ లో సినిమాలు వచ్చాయి.
అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్..
చిరంజీవితో బాబీ వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు. గోపీచంద్ మలినేని బాలయ్యతో వీర సింహా రెడ్డి చేశాడు. ఈ రెండు సినిమాలు 2023 సంక్రాంతికి పోటీ పడ్డాయి. రెండు సినిమాలు ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేశాయి. ముఖ్యంగా అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో బాబీ, గోపీచంద్ మలినేని ఇద్దరు కూడా ఎగ్జైట్ అయ్యారు. అందుకే ఆ స్టార్స్ మీద ఉన్న ప్రేమను సినిమా రూపంలో చూపించారు.
ఐతే చిరుతో బాబీ, బాలయ్యతో గోపీచంద్ రెండోసారి కలిసి చేస్తున్న సినిమాలు నెక్స్ట్ లెవెల్ ప్లాన్ తో వస్తున్నారట. వీర సింహా రెడ్డితో బాలయ్యని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన గోపీచంద్ జాత్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి నేషనల్ లెవెల్ లో సినిమా ఉండేలా చూస్తున్నారట.
సీరియస్ యాక్షన్ మూవీగా..
ఇక చిరంజీవి బాబీ కాంబో లో వాల్తేరు వీరయ్య రాగా ఈసారి ఒక సీరియస్ యాక్షన్ మూవీగా ఈ కాంబినేషన్ సినిమా వస్తుంది. ఆల్రెడీ మొన్న చిరంజీవి బర్త్ డే రోజు ఒక మాస్ పోస్టర్ తో ఈ కాంబో అనౌన్స్ మెంట్ జరిగింది. ఐతే దసరాకి ఈ రెండు సినిమాల అనౌన్స్ మెంట్ కుదిరితే పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలుస్తుంది.
ప్రస్తుతం బాలయ్య అఖండ 2 పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా డిసెంబర్ రిలీజ్ ఉంటుందని టాక్. మరోపక్క చిరంజీవి అనిల్ రావిపూడితో చేస్తున్న మన శంకర ప్రసాద్ ని పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆ సినిమా 2026 సంక్రాంతికి వస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ మూవీస్ ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ ఇస్తాయని చెప్పొచ్చు. చిరంజీవి బాబీతో పాటు శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా ప్లాన్ చేశాడు. ది ప్యారడైజ్ సినిమా పూర్తైన తర్వాత చిరు సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు శ్రీకాంత్. బాలయ్య మాత్రం అఖండ 2 పూర్తైన తర్వాత గోపీచంద్ సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది.
