Begin typing your search above and press return to search.

హ‌నుమాన్ జంక్ష‌న్‌లో టీ తాగుతున్న ఆ న‌లుగురు

ద‌శాబ్ధాలుగా తెలుగు చిత్ర‌సీమ‌కు నాలుగు మూల‌ స్థంబాలుగా నిలిచిన అగ్ర‌ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ క‌లిసి ఒక చోట టీ కొడుతున్న ఈ దృశ్యం నిజంగా స్ట‌న్ అయ్యేలా చేస్తోంది.

By:  Sivaji Kontham   |   24 Nov 2025 12:54 PM IST
హ‌నుమాన్ జంక్ష‌న్‌లో టీ తాగుతున్న ఆ న‌లుగురు
X

చూస్తున్నారు క‌దా ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్‌.. ఈ స్ట‌యిల్ నెవ్వ‌ర్ బిఫోర్! ద‌శాబ్ధాలుగా తెలుగు చిత్ర‌సీమ‌కు నాలుగు మూల‌ స్థంబాలుగా నిలిచిన అగ్ర‌ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ క‌లిసి ఒక చోట టీ కొడుతున్న ఈ దృశ్యం నిజంగా స్ట‌న్ అయ్యేలా చేస్తోంది. రోడ్ సైడ్ కాకా హోట‌ల్ ని చూడ‌గానే ఇది హ‌నుమాన్ జంక్షన్ లో కాకా హోట‌లా? బెజ‌వాడ బెంజి స‌ర్కిల్ రోడ్ లోనా? లేదా క‌త్తిపూడి జంక్ష‌నా? అని డౌట్లు కూడా పుట్టుకొస్తున్నాయి.




నిజంగానే ఆ న‌లుగురు ఓ చోట క‌లిసి టీ తాగారా..! అనే డౌట్ పుట్టించారు.. అయితే ఆ న‌లుగురు ఇలా క‌లిసేందుకు ఆస్కారం ఉందా? అంటే ఛాన్సే లేదు! కానీ ఏఐ(కృత్రిమ మేథ‌స్సు) దేనిని అయినా సుసాధ్యం చేయ‌గ‌ల‌దు. ఇటీవ‌లి కాలంలో పాజిబిలిటీ లేని వాటిని కూడా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ తో సాధ్యమ‌యేట్టు చేస్తున్నారు.




ఏఐ సాంకేతిక‌త ఇటీవ‌ల ర‌క‌ర‌కాలుగా విప‌త్తుల‌కు దారి తీయ‌డ‌మే కాదు సోద‌ర‌భావాన్ని కూడా పెంచుతోంది. ఇటీవల రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, ధనుష్, అజిత్ కూడా ఇదే మాదిరిగా ఎంతో నేచుర‌ల్ గా రోడ్డు పక్కన ఉన్న కేఫ్‌లో టీ తాగుతున్న ఫోటో నెట్ లో వైర‌ల్ అయింది. వారంతా షార్ట్స్, లుంగీలు ధరించి ఇది రియ‌ల్ పిక్చ‌ర్ అనే రేంజులో ఫోజులిచ్చారు. క‌ట్ చేస్తే అది కూడా ఏఐలో త‌యారు చేసిన‌ది అని తెలిసి ముక్కున వేలేసుకున్నారు.




ఇప్పుడు చిరు-బాల‌య్య‌-నాగ్- వెంకీ మాత్ర‌మే కాదు, ప్రభాస్, మ‌హేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్లు ఇలా కాకా హోట‌ల్ లో టీ కాఫీలు తాగుతున్న ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. ఇది ఇటీవ‌లి కాలంలో ఒక ట్రెండ్ గా మారుతోంది. ఒక‌రిని చూసి ఇంకొక‌రు యూత్ ఇలా ఏఐలో క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శిస్తూ సెల‌బ్రిటీల‌లో గుబులు పెంచుతున్నారు.




క‌థానాయిక‌ల‌కు పెను ముప్పు:

అయితే మారిన టెక్నాల‌జీతో పెను ముప్పును ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా యువ‌క‌థానాయిక‌లు, న‌టీమ‌ణుల ఫోటోల‌ను ఏఐలో మార్పులు చేసి, లేనిది ఉన్న‌ట్టుగా అస‌భ్య‌క‌రంగా మార్చి వారి ప‌రువుమ‌ర్యాద‌ల‌కు తీవ్ర భంగం క‌లిగేట్టు చేస్తున్నారు. ఇది క్ష‌మించ‌రాని నేరం కాబ‌ట్టి సైబ‌ర్ క్రైమ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.




ఇంత‌కుముందు ర‌ష్మిక మంద‌న్న రియ‌ల్ ఇమేజెస్ ని ఏఐలో రీక్రియేట్ చేసి వ‌ల్గ‌ర్ గా ప్ర‌ద‌ర్శించిన తీరుకు అంద‌రూ షాక్ అయ్యారు. జాన్వీ, సారా అలీఖాన్, కీర్తి సురేష్, అన‌న్య పాండే ఇలా యువ‌నాయిక‌లంతా ఏఐ వికృత చేష్ట‌ల‌కు బాధితులుగా మారారు. వారంతా ఏఐతో ముప్పు గురించి సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. అంద‌మైన క‌థానాయిక‌ల‌ ఫిజిక‌ల్ అప్పియ‌రెన్స్ ని మ‌రింత బోల్డ్ గా మార్చేసి, మ‌రింత హా* గా క‌నిపించేలా ఏఐలో భ్ర‌మింపజేస్తున్నారు. ఇది కేవ‌లం సెల‌బ్రిటీల‌కే ప‌రిమితం కాదు. టెక్నాల‌జీ పెరిగే కొద్దీ మ‌గువ‌ల ఫోటోలు, వీడియోల‌ను మ‌రింత అస‌భ్య‌క‌రంగా మార్చేస్తూ నేటి సాంకేతిక విద్యార్థులు ప్ర‌తిదీ దుర్వినియోగం చేస్తున్నారు.




కోర్టుల‌కు వెళుతున్న స్టార్లు:

ఇటీవ‌లి కాలంలో ఐశ్వ‌ర్యారాయ్ , అభిషేక్ బ‌చ్చ‌న్, నాగార్జున‌, చిరంజీవి వంటి ప్ర‌ముఖులు కోర్టుల‌ను ఆశ్ర‌యించి త‌మ ఫోటోలు, వీడియోలు, వాయిస్ లు లేదా ఇంకేదైనా త‌మ‌కు చెందిన ప్రాప‌ర్టీని అనుమ‌తి లేకుండా దుర్వినియోగం చేయకుండా ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోర‌గా దీనికి న్యాయ‌స్థానాలు మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నాయి.