మెగా అభిమానుల్ని 20 ఏళ్లు వెనక్కి!
మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్ గారు` తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 30 Nov 2025 7:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్ గారు` తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తోన్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇది. సినిమా ఎలా ఉంటుంది? అన్నది ప్రారంభానికి ముందే చిరు లీక్ ఇచ్చేసారు. కొదండ రామిరెడ్డి సినిమాల తరహాలోనే అనీల్ సినిమా ఉండబోతుందని చెప్పకనే చెప్పారు. చిరంజీవి తనదైన మార్క్ హాస్యభరిత పాత్రలో అలరించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.
అభిమానులకు డబుల్ బొనాంజ:
అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని అనీల్ రివీల్ చేసారు. గత సంక్రాంతి కంటే ఈసారి డబుల్ బొనాంజ ఉంటుందన్నారు. గత సంక్రాంతికి అనీల్ డైరెక్టర్ చేసిన `సంక్రాంతి వస్తున్నాం` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. వెంకటేష్ ని ఏకంగా 300 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టిన చిత్రమది. అనీల్ తాజా ప్రకటన నేపథ్యంలో అంచనాలు పీక్స్ కు చేరుతున్నాయి. అనీల్ లెక్క తప్పకుడదంటే సినిమా ఏకంగా 500 కోట్ల వసూళ్లతో మెగాస్టార్ కెరీర్ కి ఆల్ టైమ్ హిట్ ఇవ్వాల్సి ఉంటుంది.
చిరు సక్సెస్ ఫార్ములాతోనే:
ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అనీల్ డబుల్ బొనాంజ ప్రకటన చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు. అలాగే చిరంజీవిని అభిమానులు ఎప్పటి నుంచో చూడాలనుకుంటోన్న పాత్రలో చూస్తారని మరోసారి చెప్పకనే చెప్పారు. అన్నయ్యకు ఈ జానర్ ఎంతో నచ్చిన చిత్రంగా పేర్కొన్నారు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో చిరంజీవి నటించి 20 ఏళ్లు దాటిందన్నారు. దీంతో తెలుగు ప్రేక్షకుల్ని అనీల్ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లబోతున్నారని చెప్పొ చ్చు. గతంలో ఇలాంటి జానర్లో చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయం సాధించినట్లు గుర్తు చేసారు.
మరో సాంగ్ తో రెడీగా:
ఇటీవలే రిలీజ్ అయిన `మీసాల పిల్ల` సాంగ్ మంచి హిట్ అయిందని, త్వరలో మరో సాంగ్ తో రానున్నట్లు తెలిపారు. షూటింగ్ పనులు పూర్తి కాగానే ప్రచారం పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే ప్రతీ సంక్రాంతికి ఒక సినిమాతో ప్రేక్షకుల మధ్యలో ఉండాలే ప్లాన్ చేసుకుంటున్నట్లు అనీల్ తెలిపారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో నయన్ జాయిన్ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమా ప్రారంభానికి ముందే నయన్ కొన్ని వీడియోలతో బాస్ కి ఓ రేంజ్ లో హైప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
