Begin typing your search above and press return to search.

చిరు- పవన్.. OTT మార్కెట్ లో టాప్ ఎవరు?

అలా ఓటీటీలో పవన్ సినిమా అంటే స్పెషల్ ఎంగేజ్మెంట్ ఉంటుందని ప్లాట్‌ ఫామ్స్ గుర్తించాయి.

By:  M Prashanth   |   27 Feb 2026 7:00 PM IST
చిరు- పవన్.. OTT మార్కెట్ లో టాప్ ఎవరు?
X

చిరంజీవి, పవన్ కళ్యాణ్.. వీరిలో ఒకరు దశాబ్దాలుగా బాక్సాఫీస్‌ ను శాసిస్తున్న మెగాస్టార్ అయితే.. మరొకరు తన స్పెషల్ స్టైల్ తో యూత్ హృదయాలను గెలుచుకున్న పవర్ స్టార్. థియేటర్ల వద్ద ఇద్దరికీ సమానంగా క్రేజ్ ఉన్నప్పటికీ, ఓటీటీ మార్కెట్ విషయంలో మాత్రం ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

నిజానికి చిరంజీవి సినిమాలు విడుదలైతే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూలు కడతారు. ఆయన నటించిన చిత్రాలు వరుసగా భారీ వసూళ్లు సాధిస్తూ రూ.300 కోట్ల క్లబ్‌ లోకి చేరిన అనేక సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆయన సినిమాలకు ఓటీటీ హక్కులు కూడా భారీగా అమ్ముడవుతాయని అంతా భావిస్తారు. కానీ పరిస్థితి మాత్రం వేరుగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే చిరంజీవి చిత్రాల డిజిటల్ హక్కులు సాధారణంగా రూ.40- 50 కోట్ల మధ్య ఫైనల్ అవుతున్నాయని సమాచారం. బాక్సాఫీస్ రేంజ్ తీసుకుంటే ఇది కొంత షాకింగ్ గానే అనిపిస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మాత్రం లెక్కలు వేరుగా కనిపిస్తున్నాయి. ఆయన సినిమాలకు విడుదలకు ముందే ఓటీటీ సంస్థలు భారీగా పోటీ పడుతున్నాయి.

ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ పవన్ సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దాదాపు రూ.80 కోట్లకు పైగా చెల్లించి డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఆ రేంజ్ డీల్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌ గా మారింది. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్‌ కు ఉన్న డైహార్డ్ ఫ్యాన్ బేస్ అని వినికిడి.

ఎందుకంటే ఆయన సినిమాలు థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా రిపీట్ వ్యూయింగ్ సాధిస్తాయి. యూత్, ఓవర్సీస్ ఆడియన్స్, సోషల్ మీడియా ట్రెండ్.. అన్నీ కలిసి ఆయన సినిమాలకు డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ లలో భారీ వ్యూయర్‌ షిప్ తీసుకువస్తున్నాయి. ఇటీవల డిజిటల్ రిలీజ్ అయిన OG మూవీ మంచి స్పందన అందుకోవడం కూడా దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి.

అలా ఓటీటీలో పవన్ సినిమా అంటే స్పెషల్ ఎంగేజ్మెంట్ ఉంటుందని ప్లాట్‌ ఫామ్స్ గుర్తించాయి. అందుకే ముందుగానే పెద్ద మొత్తాలు చెల్లించి హక్కులు సొంతం చేసుకుంటున్నాయి. ఇక మరో ప్రముఖ ప్లాట్‌ ఫామ్ అమెజాన్ ఫ్రైమ్ వీడియో కూడా స్టార్ హీరోల చిత్రాల కోసం పోటీ పడుతున్నప్పటికీ, పవన్ సినిమాల విషయంలో నెట్‌ ఫ్లిక్స్ టాప్ లో ఉంది. ఏదేమైనా చిరంజీవి, పవన్ ఇద్దరికీ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్నా, ఓటీటీ రేసులో మాత్రం పవర్ స్టార్ టాప్ లో ఉన్నారని చెప్పాలి.