ఒకే నేపథ్యం.. బాలయ్య వర్సెస్ చిరు.. నెగ్గేదెవరు?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల పోరు అంటేనే ఒక సెన్సేషన్. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వార్ మరోసారి ఆసక్తికరంగా మారింది.
By: Madhu Reddy | 28 Jan 2026 10:45 PM ISTటాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల పోరు అంటేనే ఒక సెన్సేషన్. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వార్ మరోసారి ఆసక్తికరంగా మారింది. సాధారణంగా వీరిద్దరూ వేర్వేరు జానర్లతో పోటీ పడుతుంటారు, కానీ ఈసారి ఇద్దరూ ఒకే రకమైన 'గ్యాంగ్‌స్టర్' నేపథ్యంతో బరిలోకి దిగుతుండటం విశేషం. ఇద్దరు దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని ఇద్దరూ మాస్ పల్స్ తెలిసిన వారు కావడంతో, ఈ గ్యాంగ్‌స్టర్ యుద్ధంలో పైచేయి ఎవరిదనే చర్చ ఫిల్మ్ నగర్ లో వేడెక్కిస్తోంది.
మెగాస్టార్ వర్సెస్ బాలయ్య మాస్ పవర్:
చిరంజీవి-బాబీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో చిరు వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారని, అనస్వర రాజన్ ఆయన కూతురిగా నటిస్తుండటం కథలోని ఎమోషనల్ యాంగిల్‌ను హైలైట్ చేస్తోంది.
ముఖ్యంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తుండటం ఈ సినిమాకు పాన్-ఇండియా అప్పీల్‌ను తెస్తోంది. 'కాక' లేదా 'కాకాజీ' అనే టైటిల్స్ పరిశీలనలో ఉండగా, బాబీ తన గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ మ్యాజిక్‌ను మించిపోయేలా ఈ గ్యాంగ్‌స్టర్ కథను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ తన మార్క్ గ్రేస్, యాక్షన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
గ్యాంగ్‌స్టర్ డ్రామాలో గోపీచంద్ మలినేని మార్క్:
మరోవైపు, బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ అనగానే ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ గుర్తుకొస్తుంది. ఇక గోపీచంద్ కూడా ఓ ఇంటర్వ్యూ లో వీరసింహారెడ్డిని మించి ఉంటుందని చెప్పటం, మూవీ పైన అంచనాలు పెంచేసాయి. ఈసారి వీరు కూడా గ్యాంగ్‌స్టర్ నేపథ్యాన్ని ఎంచుకోవడం గమనార్హం. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, ఊర మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో గోపీచంద్ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఇక బాలయ్య డైలాగ్ డెలివరీ, గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో పీక్స్‌లో ఉంటాయని నందమూరి అభిమానులు ధీమాగా ఉన్నారు. చిరు పక్క మాస్ గ్యాంగ్‌స్టర్‌గా వస్తుంటే, బాలయ్య ఉర మాస్ గ్యాంగ్‌స్టర్‌గా పోటీ ఇవ్వబోతున్నారు.
ఒకే నేపథ్యం.. గెలుపు ఎవరిది?:
ఇక ఒకే సమయంలో ఇద్దరు అగ్ర హీరోలు ఒకే బ్యాక్‌డ్రాప్‌తో రావడం రిస్క్ అనిపించినా, కథనంలో వైవిధ్యం ఉంటే ప్రేక్షకులు రెండింటినీ ఆదరిస్తారని గతంలో నిరూపితం అయింది. చిరంజీవి సినిమాలో ఎమోషన్ , స్టైలిష్ యాక్షన్ ప్రధాన బలం కానుంటే, బాలయ్య సినిమాలో హై-వోల్టేజ్ మాస్ సీక్వెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. గతంలో సంక్రాంతి బరిలో ఇద్దరూ తలపడినప్పుడు చెరో రికార్డును సొంతం చేసుకున్నారు. అభిమానులకు మాత్రం ఈ పోరు ఒక అసలైన సినిమా పండగను అందించడం ఖాయం.
