Begin typing your search above and press return to search.

విశ్వంభర టెస్ట్ పాస్ అవుతాడా..?

ఈ క్రమంలో విశ్వంభర టీం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   18 Aug 2025 9:43 AM IST
విశ్వంభర టెస్ట్ పాస్ అవుతాడా..?
X

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాపై ఊహించని విధంగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. సినిమా విషయంలో సీజీ ఎక్కువ ఇంపార్టెంట్ అని తెలుస్తుండగా ఈమధ్య వచ్చిన కొన్ని సినిమాల వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చూసి ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. విశ్వంభర సినిమాల్లో కూడా ఈ సీజీ వర్క్ పాళ్లు చాలా ఎక్కువ అని తెలుస్తుంది. సినిమాలో అరకొర ఉంటేనే నిరాశ పడుతున్న ఆడియన్స్ దాని మీదే ఎక్కువ డిపెండ్ అవుతున్న సినిమా విషయంలో మరింత ఫోకస్ తో ఉంటారు.

ఆగష్టు 22న విశ్వంభర టీజర్..

ఈ క్రమంలో విశ్వంభర టీం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఓ పక్క చిరంజీవి బర్త్ డే వస్తుంది. ఆగష్టు 22న టీజర్ వదలాల్సి ఉంది. సీజీ వర్క్ మీద సాటిస్ఫై అయితేనే టీజర్ వదలాలని అనుకుంటున్నారట. అదేంటో సినిమా బడ్జెట్ ని కోట్లకు కోట్లు పెట్టే నిర్మాతలు వి.ఎఫ్.ఎక్స్, సీజీ వర్క్ విషయంలో ఆడియన్స్ ని తక్కువ అంచనా వేస్తున్నారు. నాసిరకం సీజీ లతో లాగిచ్చేద్దాం అంటే ఊరుకునే పరిస్థితి లేదు.

హాలీవుడ్ సీరీస్ లు, యానిమేషన్ మూవీస్, బెస్ట్ సీజీ వర్క్ లు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి వాటితో పోలుస్తూ మన సినిమాలను చూస్తున్నారు. ఆ రేంజ్ వర్క్ ఇవ్వకపోయినా బెస్ట్ అనిపిస్తే చాలని అనుకుంటున్నారు. చిరంజీవి విశ్వంభర లాస్ట్ ఇయర్ వచ్చిన టీజర్ డిజప్పాయింట్ చేసింది కాబట్టే ఆ టీం ని మార్చి కొత్త టీం తో సీజీ వర్క్ చేయిస్తున్నారు.

సినిమాపై నెగిటివిటీ పెంచేస్తున్నారు..

ఇక బర్త్ డేకి రిలీజ్ చేయాలనుకున్న టీజర్ లో సీజీ వర్క్ సూపర్ అనిపిస్తేనే వదులుతారట. ఏమాత్రం తేడా ఉన్నా జస్ట్ బర్త్ డే కి ఒక పోస్టర్ తో సరిపెడతారని తెలుస్తుంది. ఐతే టీజర్ కే ఇలా వెనకడుగు వేస్తే సినిమా టైంలో ఎలా అనుకోవచ్చు. ఈమధ్య టీజర్, ట్రైలర్ లతోనే సినిమాపై నెగిటివిటీ పెంచేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో ఏమాత్రం గ్రాఫిక్స్ బాగాలేకపోయినా ఒక మ్యాచ్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి రెడీ అయిపోతుంది. ఏ హీరో సినిమా అయినా సరే సీజీ వర్క్ బాగాలేకపోతే చీల్చి చెండాడేస్తారు.

సో విశ్వంభర టీం ఈ విషయాన్ని పరిగణలో తీసుకుని మంచి అవుట్ పుట్ ఇవ్వాలని చూస్తున్నారు. విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ సెకండ్, థర్డ్ వీక్ రిలీజ్ ఉండొచ్చని టాక్.