Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఆ సినిమా కోసం మెగాస్టార్ రంగంలోకా

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో `విశ్వంభర` భారీ అంచనాల మ‌ధ్య తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   5 July 2026 7:43 AM IST
మ‌ళ్లీ ఆ సినిమా కోసం మెగాస్టార్ రంగంలోకా
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో `విశ్వంభర` భారీ అంచనాల మ‌ధ్య తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. గ్రాఫిక్స్ ఎక్కువ‌గా ఉండ‌టంతో? ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా టీమ్ ఆ ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. సినిమాలో విజువ‌ల్ ఎఫెక్స్ట్ కీలక పాత్ర పోషిస్తుండటంతో వాటి నాణ్యతను మరింత మెరుగుపరచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన విజువల్స్ కంటే కూడా అత్యున్నత ప్రమాణాలతో స్క్రీన్‌పై మాయాజాలం సృష్టించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని అందుకే గ్రాఫిక్స్ పనుల కోసం మరికొంత సమయాన్ని కేటాయిస్తున్నారని అధికారికంగా తెలిసిందే. తాజాగా కథా గమనంలో మరింత ఆసక్తిని పెంచేందుకు సినిమాలో ఓ కొత్త ప్రత్యేక ఎపిసోడ్‌ను జోడించాలని దర్శకుడు వశిష్ట నిర్ణయించినట్లు సమాచారం. ఈ కొత్త సన్నివేశం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాకుండా మెగాస్టార్ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్‌గా ఉండబోతుందని స‌మాచారం. ఈ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను థియేటర్లలో సీట్ల అంచున కూర్చోబెడతాయని అంటున్నారు.

ఈ ప్రత్యేక ఎపిసోడ్ చిత్రీకరణ కోసం మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రంగంలోకి దిగుతున్నారుట‌. మరో వారం రోజుల పాటు `విశ్వంభర` కొత్త షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ వారం రోజుల కాల్షీట్స్‌ను హై-వోల్టేజ్ డ్రామా సీన్ల కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా మెగాస్టార్ చూపిస్తున్న ఉత్సాహం చిత్ర యూనిట్‌లో కొత్త జోష్ నింపుతోంది. `విశ్వంభర` చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్‌గా నిలబెట్టేందుకు చిత్ర బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. అదనపు హంగులు, కొత్త ఎపిసోడ్ల జోడింపు సినిమా స్థాయిని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు.

మెగాస్టార్ కెరీర్‌లోనే ఇదొక మైలురాయిగా నిలిచేలా ప్రతి విష‌యాన్ని ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తు తం చిరంజీవి బాబి సినిమా షూటింగ్ లో పాట్గొంటున్న సంగ‌తి తెలిసిందే. `విశ్వంభ‌ర` రిలీజ్ ఆల‌స్య‌మ‌య్యే స‌రికి బాబి సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. ఈలోపే `విశ్వంభ‌ర` అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశం ఉంది.