Begin typing your search above and press return to search.

విశ్వంభర ఆ ట్విస్ట్ రివీల్ ఎప్పుడు..?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఈ సమ్మర్ నుంచి నెక్స్ట్ సమ్మర్ కి భలే పోస్ట్ పోన్ అయ్యింది.

By:  Ramesh Boddu   |   5 Sept 2025 11:00 PM IST
విశ్వంభర ఆ ట్విస్ట్ రివీల్ ఎప్పుడు..?
X

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఈ సమ్మర్ నుంచి నెక్స్ట్ సమ్మర్ కి భలే పోస్ట్ పోన్ అయ్యింది. మేకర్స్ అసలైతే ఈ ఇయర్ సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు. మరోపక్క అనిల్ రావిపూడి సినిమా చకచకా పూర్తి చేస్తున్నాడు చిరు. విశ్వంభర సినిమా చాలా పెద్ద కథతో వస్తుందని సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్ధమవుతుంది. సినిమాకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా బాగా అవసరం పడుతుంది. అందుకే విశ్వంభర నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ వాయిదా వేశారు.

భారీ బడ్జెట్ సినిమాలు రెండు భాగాలు..

విశ్వంభర సినిమా గురించి అసలు ట్విస్ట్ ఒకటి మేకర్స్ దాచేస్తున్నారు. అదేంటి అంటే సినిమా కాస్టింగ్ తో పాటు బడ్జెట్ ఇంకా మిగతా విషయాలు పరిగణలో తీసుకోవడమే కాకుండా సినిమాను ఒక పార్ట్ గా చెప్పడం కుదరదని ఫిక్స్ అయ్యారట. అందుకే విశ్వంభర సినిమాను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారని టాక్. ఈమధ్య భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా రెండు భాగాలు చేయడం సహజం అయ్యింది. ఐతే విశ్వంభర సినిమా నుంచి ఈ ట్విస్ట్ ఎప్పుడు రివీల్ చేస్తారన్నది సస్పెన్స్ గా ఉంది.

ఎందుకంటే ఈమధ్య కొన్ని సినిమాలు ఎండింగ్ లో పార్ట్ 2 అని ట్విస్ట్ ఇస్తున్నారు. విశ్వంభర టీం కూడా దాదాపు అలానే సినిమా కథ ఇంకా కొనసాగుతుందని షాక్ ఇస్తారని టాక్. అందుకే మేకర్స్ సినిమా మొత్తాన్ని రెండు భాగాలు చేసి రెండిటినీ తక్కువ టైం లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఎలాగు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉందని రిలీజ్ ని ఏడాది పొడిగించారు. సో తప్పకుండా విశ్వంభర నుంచి ఈ ట్విస్ట్ మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు.

చిరంజీవి సూపర్ ఎగ్జైటెడ్ గా..

విశ్వంభర సినిమా లో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ లాంటి వారు కూడా ఉన్నారు. సినిమా గురించి చిరంజీవి సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఫ్యాన్స్ కే కాదు సినీ ప్రియులకు కావాల్సినంత ఐ ఫీస్ట్ ఇచ్చేలా విశ్వంభర తీర్చిదిద్దుతున్నారు. అందుకే విశ్వంభర సినిమాను మేకర్స్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు.

సినిమాకు ఎం.ఎం కీరవాణి సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటాయట. సినిమాకు బిజిఎం కూడా చాలా ఇంపార్టెంట్ అనేలా ఉంటుందట. విశ్వంభర తో మెగాస్టార్ ఒక గొప్ప ప్రయోగం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుంటుందో చూడాలి.

విశ్వంభర ఏమో కానీ చిరు, అనిల్ కాంబో సినిమా మన శంకర వర ప్రసాద్ మాత్రం సంథింగ్ క్యూరియస్ గా ఉంది. సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ అయితే మెగా ఫ్యాన్స్ కి బాగా ఎక్కేసింది. మెగా బాస్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ సంక్రాంతికి సూపర్ హిట్ పక్కా అనేలా ఉంది.