Begin typing your search above and press return to search.

మెగా సినిమాను మర్చిపోయారేంటి..?

అసలైతే ఈ ఇయర్ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ చేయాల్సి ఉన్నా అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది.

By:  Ramesh Boddu   |   16 Dec 2025 10:53 AM IST
మెగా సినిమాను మర్చిపోయారేంటి..?
X

మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం మొదలు పెట్టిన విశ్వంభర సినిమా ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాను వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. చిరు చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఈ విశ్వంభర ఉంటుందని చెప్పుకుంటున్నారు. విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ కూడా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు.

సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్..

అసలైతే ఈ ఇయర్ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ చేయాల్సి ఉన్నా అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది. ఐతే సినిమాలో ఎక్కువ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉన్న కారణంగా వాటి గురించి ఆడియన్స్ నుంచి నెగిటివిటీ వస్తుందన్న భావనతో మరింత శ్రద్ధతో గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారు. సినిమాను 2026 సంక్రాంతికి అనుకున్నారు ఫైనల్ గా నెక్స్ట్ సమ్మర్ కి సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.

సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్ వస్తుంది. ఐతే ఈ సినిమా కన్నా ఎప్పుడో మొదలైన విశ్వంభర కనీసం మినిమం బజ్ ని కూడా తెచ్చుకోలేకపోతుంది. విశ్వంభర మీద కామన్ ఆడియన్స్ కాదు మెగా ఫ్యాన్స్ కూడా అంత ఆసక్తిగా లేరన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసినా దానికి కూడా నామ మాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది.

విశ్వంభర ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే స్టఫ్..

విశ్వంభర సినిమా సమ్మర్ రిలీజ్ ఉంది. అయినా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రావట్లేదు. విశ్వంభర సినిమా విషయంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఐతే సినిమా కథను హింట్ ఇస్తూ త్వరలో సినిమా నుంచి ఒక టీజర్ వస్తుందట. అది సినిమాపై అంచనాలు పెంచేస్తుందని అంటున్నారు. మరి విశ్వంభర సినిమా నిజంగానే ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే స్టఫ్ తో వస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది. ఐతే ఈ సినిమా పై మెగా బాస్ మాత్రం చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది.

అడ్వెంచర్ కథతో విజువల్ ఫీస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు విశ్వంభర వస్తుంది. విశ్వంభర బజ్ పెంచి సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించేలా మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంది.అ ఐతే ఎలాగు మన శంకర వప్రసాద్ రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ తర్వాత విశ్వంభర ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

ఈ సినిమాతో త్రిష ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ తెలుగు రీ ఎంట్రీ ఇస్తుంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు ఈమధ్య పూర్తిగా తమిళ సినిమాలకే అంకితమైంది.