Begin typing your search above and press return to search.

విశ్వంభ‌ర ఓటీటీ డీల్ సెట్ అయిందా?

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా `బింబిసార` ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర`పై అంచ‌నాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   13 Sept 2026 10:32 PM IST
విశ్వంభ‌ర ఓటీటీ డీల్ సెట్ అయిందా?
X

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా `బింబిసార` ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర`పై అంచ‌నాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న విజువల్ స్పెక్టాకిల్‌పై ప్రారంభం నుంచే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కార‌ణంగా రిలీజ్ డిలే అవ్వ‌డం సినిమాకు ప్ర‌తికూలంగా మారింది. ఈనేప‌థ్యంలో ఓటీటీ హక్కుల విషయంలోనూ కొంత‌ స్తబ్దత నెల‌కొంది. డిజిటల్ రైట్స్‌కు సంబంధించి నిర్మాతలు ఆశిస్తున్న రేటుకు, మార్కెట్‌లో డిజిటల్ వేదికలు ఆఫర్ చేస్తున్న మొత్తానికి మధ్య వ్యత్యాసం ఉండటంతో డీల్ ఆల‌స్య‌మ‌వుతోంది.

దీంతో చిత్ర విడుదల ప్రకటన కూడా పెండింగ్‌లో పడిందనే చర్చలు జరిగాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టంభనకు తెర దించుతు ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ ఈ ప్రాజెక్ట్ హక్కులను సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఆశిస్తున్న ఫ్యాన్సీ ఆఫర్‌కు దరిదాపుల్లోనే చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని.. త్వరలోనే డీల్‌పై అధికారిక సంతకాలు కూడా పూర్తి కానున్నాయని టాక్ వినిపిస్తోంది.

సోనీ లివ్ సంస్థ దక్కించుకునేందుకు సిద్ధపడటంతో సినిమా డిజిటల్ బిజినెస్ క్లియర్ అయినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సినిమా రిలీజ్‌కు ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయినట్లయింది. ఓటీటీ బిజినెస్ వ్యవహారం పూర్తయిన వెంటనే యూనిట్ గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే సరికొత్త విజువల్ పోస్టర్‌తో విడుదల తేదీపై నిర్మాతలు అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

ఈ వార్తతో కొన్ని రోజులుగా నిరాశలో ఉన్న మెగా అభిమానుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం నిండింది. ఇప్ప‌టికే రిలీజ్ కు సంబంధించి రెండు తేదీలు తెర‌పైకి వ‌స్తున్నాయి. డిసెంబ‌ర్ 3 లేదా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు లీకైంది. `విశ్వంభ‌ర` డిసెంబ‌ర్ లో రిలీజ్ అయితే `కాకా` చిత్రాన్ని స‌మ్మ‌ర్ కి వాయిదా వేస్తారు. అయితే ఈ క్ర‌మంలో `ఫౌజీ` నుంచి `విశ్వంభ‌ర` పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. డిసెంబ‌ర్ 3న `ఫౌజీ` కూడా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

అయితే సీనియ‌ర్ స్టార్ తో పోటీకి ప్ర‌భాస్ ఎప్పుడూ దూరంగా ఉంటారు. తానెప్పుడు సీనియ‌ర్ల‌కు పోటీగా వెళ్ల కూడ‌ద‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నారు. నిర్మాత‌ల్ని ఆ ర‌కంగా ఒప్పించే త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాడు. అయితే రిలీజ్ అన్న‌ది అత‌డి చేతుల్లోనే ఉండ‌దు. నిర్మాత‌లు అన్ని లెక్క‌లు వేసుకుని వ్యాపార కోణంలో చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. అలాంటి స‌మ‌యాల్లో ప్ర‌భాస్ కూడా ఏం చేయ‌ల‌ని స్థితిలో ఉంటాడు? అన్న‌ది అంతే వాస్త‌వం.