Begin typing your search above and press return to search.

మెగా 'విశ్వంభర'.. లైన్ క్లియర్ అయినట్లేనా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   24 Feb 2026 6:00 PM IST
మెగా విశ్వంభర.. లైన్ క్లియర్ అయినట్లేనా?
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. భారీ బడ్జెట్‌ తో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ తో రూపొందుతున్న ఆ సినిమా మొదట అనుకున్న డేట్ కు థియేటర్స్ లో రిలీజ్ అవ్వలేదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీపై వచ్చిన విమర్శలు కారణంగా మేకర్స్ పలుమార్లు వాయిదా వేశారు.

అయితే 2026 సమ్మర్ లో సినిమా రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చిన మెగాస్టార్.. ఇప్పుడు విశ్వంభర విషయంలో ఫైనల్ డిసిషన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి విశ్వంభరపై స్టార్టింగ్ నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కెరీర్‌ లో ఇదొక విభిన్నమైన ఫాంటసీ మూవీ కావడంతో, సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ లో విజువల్స్‌ తో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేకర్స్ సమయం తీసుకుంటున్నారు.

ముందు సిద్ధమైన గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వాటిని పూర్తిగా మార్చి, కొత్తగా రీ డిజైన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే దాదాపు ఏడాదికిపైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ దాదాపు వీఎఫ్ఎక్స్ పనులు కంప్లీట్ అయినట్లు తెలుస్తున్నప్పటికీ.. రిలీజ్ మరింత ఆలస్యం చేస్తే నిర్మాతకు ఆర్థికంగా భారీ భారం పడే అవకాశం ఉందని మూవీ టీమ్ భావిస్తోంది!

భారీ సెట్లు, లాంగ్ టైమ్ షూటింగ్, టెక్నికల్ వర్క్ కారణంగా ఇప్పటికే ఖర్చులు పెరిగిపోయాయని సమాచారం. దీంతో విడుదలను ఇంకా లేట్ చేయడం కన్నా, ఇప్పుడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచిదని నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ స్వయంగా టీమ్‌ తో రీసెంట్ గా సమావేశమై పరిస్థితిపై చర్చించి.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారట.

అందుకే ఇప్పుడు ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న అధికారికంగా విశ్వంభర మూవీ విడుదల తేదీ ప్రకటించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడం సరైన సమయమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విశ్వంభర చిరంజీవి కెరీర్‌ లో మరో మైల్ స్టోన్ గా నిలవాలని అటు మెగా అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఆశిస్తున్నారు.

ఫాంటసీ, అడ్వెంచర్, ఎలిమెంట్స్ తో రూపొందుతున్న విశ్వంభర మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ను కచ్చితంగా నచ్చేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, అప్డేట్లు సినిమాపై ఆసక్తి మరింత పెంచాయి. ఏదేమైనా ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ వచ్చిన విశ్వంభరకు రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నట్లు కనిపిస్తోంది. ఉగాది రోజున విడుదల తేదీ ప్రకటన వస్తున్నట్లు తెలుస్తోంది. మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.