Begin typing your search above and press return to search.

స‌మ్మ‌ర్ నుంచి మెగాస్టార్ బ‌రిలోకి!

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో `మ‌న‌శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ జ‌మ అయింది.

By:  Srikanth Kontham   |   20 Jan 2026 7:00 PM IST
స‌మ్మ‌ర్  నుంచి మెగాస్టార్ బ‌రిలోకి!
X

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో `మ‌న‌శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ జ‌మ అయింది. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన సినిమా స‌క్సెస్ పుల్ గా దూసుకుపోతుంది. ఇప్ప‌టికే సినిమా 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. చాలా చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. దీంతో నిర్మాత‌లు స‌హా అంతా సంతోషంగా క‌నిపిస్తున్నారు. గ్రాండ్ గా స‌క్సెస్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేస‌విలో చిరంజీవి న‌టించిన మ‌రో చిత్రం `విశ్వంభ‌ర` కూడా రిలీజ్ అయిపోతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల్లో జాప్యం కార‌ణంగా వాయిదా ప‌డింది.

కానీ స‌మ్మ‌ర్ లో ఎట్టి ప‌రిస్థితుల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మ‌రి చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ సంగతేంటి? అంటే అందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతుంది. మార్చి లేదా ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం శ్రీకాంత్ ఓదెల నాని హీరోగా `ది ప్యార‌డైజ్` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ 70 శాతానికి పైగా పూర్త‌యింది. పెండింగ్ షూటింగ్ మ‌రో రెండు నెల‌ల్ఓ పూర్తి కానుంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే శ్రీకాంత్ సినిమాను లైన్ లో పెడుతున్నాడు.

ది ప్యార‌డైజ్ కు ముందే చిరంజీవి సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కానీ తాత్క‌లికంగా చిరు ప్రాజెక్ట్ ను ప‌క్క‌న‌బెట్టి నానితో ముందుకెళ్లారు. చిరంజీవికి కూడా వేర్వేరు క‌మిట్ మెంట్లు ఉండ‌టంతో? శ్రీకాంత్ ని హోల్డ్ లో పెట్టారు. `ది ప్యార‌డైజ్` ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డం, చిరంజీవి న‌టించిన `మ‌న శంక‌ర‌వ‌ర ప్ర‌సాద్ గారు` రిలీజ్ అవ్వ డం..`విశ్వంభ‌ర` షూటింగ్ పూర్తవ్వ‌డంతో? త‌దుప‌రి పూర్తి చేయాల్సింది శ్రీకాంత్ ప్రాజెక్ట్ కావ‌డంతో సంసి ద్ద‌మ‌వుతున్నారు. `విశ్వంభ‌ర‌`కు సంబంధించి చిరంజీవి డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేయాలి.

అలాగే ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలో ప్ర‌చారంలో జాయిన్ అవ్వాలి. ఆ రెండు ప‌నులు కూడా పూర్తి చేస్తే చిరు పూర్తిగా ఆ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ అయిన‌ట్లే. నానితో శ్రీకాంత్ తెర‌కెక్కించేది కూడా భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌రే. `రాక్ష‌సుడు` త‌ర‌హా కాన్సెప్ట్ అని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి గ‌త చిత్రాల‌కంటే ఎక్కువ‌ క‌ష్ట ప‌డాలి. చిరంజీవి లుక్ ప‌రంగా మార్పు తీసుకొచ్చింది కూడా ఈ సినిమా కోసమేన‌ని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. మెగాస్టార్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనే ప్ర‌త్యేక‌మైన చిత్రంగా శ్రీకాంత్ ప్రాజెక్ట్ నిలుస్తుంద‌నే టాక్ ఫిలిం స‌ర్కిల్స్ లో న‌డుస్తోంది.